ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

LokeshPadayatra: యువగళం పాదయాత్రలపై ఎన్నికల సంఘానికి కలెక్టర్‌ లేఖ

ABN, First Publish Date - 2023-02-09T20:08:57+05:30

స్థానిక సంస్థలు, పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల (MLC election) నేపధ్యంలో గడపగడపకూ ప్రభుత్వం కార్యక్రమం, అలాగే టీడీపీ (TDP) కి చెందిన యువగళం పాదయాత్ర (YuvaGalamPadayatra)ల కొనసాగింపుపై స్పష్టత ఇవ్వాలని...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుపతి: స్థానిక సంస్థలు, పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల (MLC election) నేపధ్యంలో గడపగడపకూ ప్రభుత్వం కార్యక్రమం, అలాగే టీడీపీ (TDP) కి చెందిన యువగళం పాదయాత్ర (YuvaGalamPadayatra)ల కొనసాగింపుపై స్పష్టత ఇవ్వాలని చిత్తూరు జిల్లా కలెక్టర్‌ హరినారాయణన్‌ (Harinarayanan) రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేశ్‌ కుమార్‌ మీనాకు లేఖ రాశారు. ప్రకాశం-నెల్లూరు-చిత్తూరు పట్టభద్రుల నియోజకవర్గం, ప్రకాశం-నెల్లూరు-చిత్తూరు ఉపాధ్యాయ నియోజకవర్గం, ఉమ్మడి చిత్తూరు జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ... ఇలా మూడు ఎమ్మెల్సీ స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం గురువారం ఎన్నికల షెడ్యూలు జారీ చేసిన సంగతి తెలిసిందే. దీంతో గురువారం నుంచే ఎన్నికలు జరిగే ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చినట్టయింది. కాగా జిల్లాలో ఇప్పటికే ప్రభుత్వ పరిధిలో గడపగడపకూ ప్రభుత్వం అనే కార్యక్రమం అమలవుతోంది. అందులో భాగంగా అధికార పార్టీ ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో ఇంటింటికీ తిరిగి ఇప్పటి వరకూ ఆయా కుటుంబాలకు తమ ప్రభుత్వం చేసిన మేలేమిటో తెలియజేస్తున్నారు. మరోవైపు టీడీపీ యువనేత నారా లోకేశ్‌ (NaraLokesh) యువగళం పేరిట చేపట్టిన పాదయాత్ర ప్రస్తుతానికి చిత్తూరు జిల్లాలో కొనసాగుతోంది.

ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో భాగంగా ఈ రెండింటి విషయంలో జిల్లా యంత్రాంగం ఎలాంటి వైఖరి తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది. గడపగడపకూ ప్రభుత్వం అనేది ప్రభుత్వ కార్యక్రమం కాబట్టి ఎన్నికలు ముగిసే వరకూ ఆపడం సమంజసమా అన్న ప్రశ్న అధికారవర్గాల్లో ఉత్పన్నమవుతోంది. అయితే అదే సమయంలో గత మూడున్నరేళ్ళలో తమ ప్రభుత్వం సంక్షేమ పథకాల ద్వారా కుటుంబాల వారీగా చేసిన మేలును వివరిస్తూ కరపత్రాల రూపంలో ఇంటింటికీ వెళ్ళి అందజేస్తున్నందున అది ఎన్నికలను ప్రభావితం చేస్తుందన్న అంశం అధికారులు గుర్తించారు. మరోవైపు టీడీపీ యువనేత నారా లోకేశ్‌ కూడా పాదయాత్ర సందర్భంగా తమ ప్రభుత్వం వస్తే మంచి చేస్తామంటూ పలు హామీలు ఇస్తున్న సంగతి కూడా తెలిసిందే. ఆ అంశం కూడా ఎన్నికలను ప్రభావితం చేస్తుందని జిల్లా యంత్రాంగం భావిస్తోంది. అలాగని జిల్లాస్థాయిలో తీసుకునే నిర్ణయం కాకపోవడంతో చిత్తూరు కలెక్టర్‌ దీనిపై తమకు స్పష్టత ఇవ్వాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి లేఖ రాశారు. అక్కడ నుంచీ వచ్చే మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ రెండు కార్యక్రమాలపై కలెక్టర్‌ నిర్ణయం తీసుకునే అవకాశముంది. పాదయాత్ర విషయంలో ఇప్పటికే పట్టుదలతో వున్న జిల్లా టీడీపీ శ్రేణులు ఎన్నికల సంఘం స్పందన కోసం ఆతృతగా వేచి చూస్తుండగా ఇతర పార్టీలతో పాటు ప్రజానీకం కూడా ఆసక్తి ప్రదర్శిస్తున్నారు.

Updated Date - 2023-02-09T20:08:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising