ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Amaravathi Farmers: ఐఏఎస్ అధికారిని శ్రీలక్ష్మీపై అమరావతి రైతుల ఫిర్యాదు

ABN, First Publish Date - 2023-10-20T14:32:51+05:30

ఐఏఎస్ అధికారిని శ్రీలక్ష్మీపై అమరావతి రైతులు తుళ్లూరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

అమరావతి: ఐఏఎస్ అధికారిని శ్రీలక్ష్మీపై (IAS Officer Srilaxmi) అమరావతి రైతులు (Amaravati Farmers) తుళ్లూరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. 2014లో రాజధాని లేని రాష్ట్రానికి ఇక్కడ 29 గ్రామాల్లో 34 వేల ఎకరాలను సేకరించారని.. రైతులతో సీఆర్డీఏ వారు ఒప్పందం చేసుకున్నారని అమరావతి రైతులు తెలిపారు. ఒప్పందం ప్రకారం తమకు 10 సంవత్సరాలు వార్షిక కౌలు ప్రతి సంవత్సరం మేలో చెల్లించాలని.. ఇప్పటికే ఎనిమిది సంవత్సరాలు పట్టాలు ఉన్నవారికి చెల్లించారని తెలిపారు. తొమ్మిదవ సంవత్సరం జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఐదు నెలల దాటినప్పటికీ ఇప్పటికీ చెల్లించకపోవడంతో కోర్టులో పిటిషన్ వేసినట్లు రైతులు తెలిపారు. వార్షిక కౌలు చెల్లించాలని కోర్టు ఉత్తర్వులు ఇచ్చిందన్నారు. సంబంధిత అధికారిని ఐఏఎస్ శ్రీలక్ష్మీ చర్యలు చేపట్టకపోవడంతో కోర్టు ఆదేశాలు అమలు కావడం లేదని అన్నారు. అధికారులు బాధ్యతలు సక్రమంగా నిర్వహించకపోవడం వల్ల తాము నష్టపోతున్నామన్నారు. దీంతో సంబంధిత అధికారిని శ్రీలక్ష్మి పై చర్యలు తీసుకోవాలని తుళ్లూరు పోలీస్ స్టేషన్‌లో అమరావతి రైతులు ఫిర్యాదు చేశారు.

Updated Date - 2023-10-20T14:32:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising