Vizag Police: పవన్ కళ్యాణ్‌కు షరతులతో అనుమతి.. వారికి నో చెప్పిన పోలీసులు
ABN, First Publish Date - 2023-08-11T16:20:03+05:30
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) విశాఖ పర్యటనకు షరతులతో కూడిన అనుమతి ఇచ్చినట్లు విశాఖట్నం పోలీసులు (Vizag Police) తెలిపారు.
విశాఖపట్నం: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) విశాఖ పర్యటనకు షరతులతో కూడిన అనుమతి ఇచ్చినట్లు విశాఖట్నం పోలీసులు (Vizag Police) తెలిపారు. జోడుగుళ్ల పాలెం మీదుగా వెళ్లే క్రమంలో 8 వాహనాలకు అనుమతి ఇస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. జోడుగుళ్లపాలెం నుంచి రుషికొండ వద్దకు పవన్ కల్యాణ్ వెళ్లనున్నారు. పవన్ అభిమానులకు అనుమతి నిరాకరించినట్లు పోలీసులు పేర్కొన్నారు.
అంతకు ముందు పవన్ కళ్యాణ్ రుషికొండ పర్యటనపై ఉత్కంఠ కొనసాగింది. జోడుగుళ్లపాలెం జుంక్షన్ వద్ద పోలీసులు భారీగా మోహరించారు. బారికేడ్లతో రోడ్డును పోలీసులు మూసివేశారు. రుషికొండ వెళ్లేందుకు అనుమతి లేదని పోలీసులు చెప్పారు. ఇంకా నోవోటల్ లోనే పవన్ కళ్యాణ్ ఉన్నారు. పవన్ కళ్యాణ్ రుషికొండకు వెళ్లకుండా అడ్డుకుంటారేమోనని పలువురు అనుమానం వ్యక్తం చేశారు. ఎలాగైనా రుషికొండకు పవన్ కళ్యాణ్ వెళ్లి తీరుతారని జనసేన నేతలు, కార్యకర్తలు చెప్పిన విషయం తెలిసిందే.
Updated Date - 2023-08-11T16:22:03+05:30 IST