అప్పుల బాధ భరించలేక దంపతుల ఆత్మహత్య
ABN, First Publish Date - 2023-02-18T07:47:17+05:30
అప్పులు కుటుంబాలను కుటుంబాలనే చిదిమేస్తున్నాయి. అప్పుల బాధ భరించలేక ఎంతోమంది తమ కుటుంబంతో సహా ఉసురు తీసేసుకున్నారు.
తిరుపతి : అప్పులు కుటుంబాలను కుటుంబాలనే చిదిమేస్తున్నాయి. అప్పుల బాధ భరించలేక ఎంతోమంది తమ కుటుంబంతో సహా ఉసురు తీసేసుకున్నారు. తాజాగా ఓ జంట కూడా అప్పుల బాధ భరించలేక ఆత్మహత్యకు పాల్పడింది. తమిళ నాడు సెలంకు చెందిన బాలాజీ, నీలిమ దంపతులు నిన్న తిరుపతికి వచ్చి పీకే లేఅవుట్‌లోని ఓ లాడ్జ్ తీసుకున్నారు. అనంతరం వారిద్దరూ ఆత్మహత్యకు పాల్పడ్డారు. లాడ్జ్ యజమాని ఫిర్యాదు మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలిస్తున్నారు. అప్పుల పాలై దంపతులు ఆత్మహత్యకు పాల్పడినట్టు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది.
Updated Date - 2023-02-18T07:47:19+05:30 IST