Ramakrishna: సీబీఐ మాజీ డైరెక్టర్ ప్రకటనపై బీజేపీ సర్కార్ తక్షణమే స్పందిచాలి
ABN, First Publish Date - 2023-06-06T12:54:38+05:30
బీజేపీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి దేశవ్యాప్తంగా రైతుల నుంచి శ్రామికుడు వరకు ఆకలితో అలమటిస్తున్నారని సీపీఐ నేత రామకృష్ణ విమర్శించారు. సోమవారం సీపీఐ జిల్లా కార్యాలయంలో పొలిటికల్ వర్క్‌షాప్‌ను రామకృష్ణ ప్రారంభించారు.
అమరావతి: బీజేపీ (BJP) అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి దేశవ్యాప్తంగా రైతుల నుంచి శ్రామికుడు వరకు ఆకలితో అలమటిస్తున్నారని సీపీఐ నేత రామకృష్ణ (CPI Leader Ramakrishna) విమర్శించారు. సోమవారం సీపీఐ జిల్లా కార్యాలయంలో పొలిటికల్ వర్క్‌షాప్‌ను రామకృష్ణ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... బడా బాబులు అంబాని నుంచి అదాని వరకు దోపిడీకి తెరలేపినా చోద్యం చూస్తూ కూర్చోవడం బీజేపీ నేతల పనిగా మారిందని మండిపడ్డారు. ఒడిశా రైలు ప్రమాదంపై సీబీఐ మాజీ డైరెక్టర్ ఇచ్చిన ప్రకటనకు బీజేపీ ప్రభుత్వం (BJP Government) తక్షణమే స్పందించాలని డిమాండ్ చేశారు. రైలు ప్రమాదంపై స్పందించకుండా సమస్యను పక్కదారి పట్టించడానికి బీజేపీ దొంగ దారులు వెదుకుంటోందని వ్యాఖ్యలు చేశారు. కేంద్ర హోంమంత్రి, రాష్ట్ర హోంమంత్రి, రైల్వే శాఖ మంత్రి కుల మత విద్వేషాలు సృష్టించాలని చూడటం దారుణమన్నారు. రైల్వే దుర్ఘటనపై హోంమంత్రి ఇంతవరకు ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు.
రామకృష్ణ ఇంకా మాట్లాడుతూ.. సీఎం జగన్ (AP CM YS Jaganmohan Reddy) పోలవరం ప్రాజెక్టు పర్యటనకు ఎందుకు వెళుతున్నారో ఆయనకైనా తెలుసో లేదో అంటూ వ్యాఖ్యలు చేశారు. జగన్ రెడ్డి కేంద్ర ప్రభుత్వంతో లాలూచిపడి రాష్ట్ర ప్రయోజనాలను బీజేపీ కాళ్ళ దగ్గర పెట్టారన్నారు. పోలవరం ప్రాజెక్టుపై సీఎం తక్షణమే స్పష్టమైన వైఖరిని ఏపీ ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో పోరాటం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. జూన్ 26 న పోలవరం ప్రాజెక్టు వద్ద భారీ బహిరంగ సభను సీపీఐ ఆధ్వర్యంలో నిర్వహిస్తామని రామకృష్ణ పేర్కొన్నారు.
Updated Date - 2023-06-06T12:54:38+05:30 IST