ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Ramakrishna: పోలవరం నిర్మాణంపై కేంద్రం విరుద్ధ ప్రకటనలు

ABN, First Publish Date - 2023-06-06T15:16:11+05:30

పోలవరం ఎత్తు తగ్గించే కేంద్ర ప్రభుత్వ కుట్రలను సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ తీవ్రంగా ఖండించారు. ఆదివారం మీడియతో మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌కు జీవనాడిగా పేరుగాంచిన పోలవరం జాతీయ ప్రాజెక్టు నిర్మాణంపై కేంద్రం పరస్పర విరుద్ధ ప్రకటనలు చేస్తోందన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: పోలవరం ఎత్తు తగ్గించే కేంద్ర ప్రభుత్వ కుట్రలను సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ (CPI Leader Ramakrishna) తీవ్రంగా ఖండించారు. ఆదివారం మీడియతో మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌కు జీవనాడిగా పేరుగాంచిన పోలవరం జాతీయ ప్రాజెక్టు నిర్మాణంపై కేంద్రం పరస్పర విరుద్ధ ప్రకటనలు చేస్తోందన్నారు. ప్రాజెక్టు నిర్మాణానికి నిధులు కేటాయించడం లేదని మండిపడ్డారు. నిర్వాసితులకు పునరావాస ప్యాకేజీ మంట గలుపుతున్నారని.. కేంద్ర ప్రభుత్వ దుష్టపన్నగాలను తిప్పి కొట్టడంలో రాష్ట్ర ప్రభుత్వం మెతక వైఖరి అవలంబిస్తోందని మండిపడ్డారు. కేంద్రం మెడలు వంచి రాష్ట్ర అభివృద్ధికి నిధులు సాధించడంలో వైసీపీ సర్కార్ విఫలమైందన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రయోజనాలను కేంద్రానికి తాకట్టు పెడుతున్నారని ఆరోపించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి (AP CM YS Jaganmohan reddy) ఈరోజు పోలవరం పర్యటన నేపథ్యంలో పోలవరం నిర్మాణంపై స్పష్టతనివ్వాలని రామకృష్ణ డిమాండ్ చేశారు.

Updated Date - 2023-06-06T15:16:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising