Vijayawada: అంగన్వాడీలకు మద్దతుగా సీపీఎం రాస్తారోకో
ABN, First Publish Date - 2023-09-25T13:07:48+05:30
సమస్యల పరిష్కారం కోసం ఆందోళనకు దిగిన అంగన్వాడీలకు మద్దతుగా సీపీఎం రాస్తారోకో నిర్వహించింది.
విజయవాడ: సమస్యల పరిష్కారం కోసం ఆందోళనకు దిగిన అంగన్వాడీలకు మద్దతుగా సీపీఎం రాస్తారోకో నిర్వహించింది. అంగన్వాడీల డిమాండ్స్ పరిష్కరించాలంటూ ఆందోళన చేపట్టారు. రోడ్డుపై బైరటించి నిరసనకు దిగారు. ఆందోళనలో పాల్గొన్న సీపీఎం రాష్ట్ర నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు మాట్లాడుతూ.. అంగన్వాడీల న్యాయమైన కోరికలను ఉక్కుపాదంతో అణచివేయడం దారుణమన్నారు. జగన్ ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. అరెస్టులు అమానుషమన్నారు. ఆడవాళ్లు కనిపిస్తే చాలు.. అంగన్వాడీ లా కదా అనేది కూడా చూడకుండా అరెస్టులు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆందోళనలో పాల్గొంటే ఉద్యోగాలు ఊడగొడతామని చెపుతున్న జగన్ ఉద్యోగాన్ని ఊడకొడతారని హెచ్చరించారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించకుంటే పోరాటం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అంగన్వాడీ అరెస్టులకు నిరసనగా ధర్నా చేస్తున్నట్లు ఆయన తెలిపారు.
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బాబూరావు మాట్లాడుతూ.. కళ్యాణ మండపాలుగా మార్చిన ఘనత జగన్ దే అని అన్నారు. పోలీసులను ఉపయోగించి ప్రజాస్వామ్యాన్ని అణచివేస్తారా అని ప్రశ్నించారు. అంగన్వాడీలు ఒంటరిగా లేరు వారితో తామున్నామని స్పష్టం చేశారు.
Updated Date - 2023-09-25T13:07:48+05:30 IST