ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

CPM: కవచ్ లేకపోవడం వల్లే ఒడిశా రైలు ప్రమాదమన్న బాబురావు.. విజయవాడలో సీపీఎం నిరసన

ABN, First Publish Date - 2023-06-05T10:45:44+05:30

ఒడిశా రైలు ప్రమాద ఘటనలో చనిపోయిన కుటుంబాలకు న్యాయం చేయాలంటూ విజయవాడ రైల్వే స్టేషన్ వద్ద సీపీఎం నిరసనకు దిగింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: ఒడిశా రైలు ప్రమాద ఘటనలో (Odisha Train Accident) చనిపోయిన కుటుంబాలకు న్యాయం చేయాలంటూ విజయవాడ రైల్వే స్టేషన్ వద్ద సీపీఎం (CPM) నిరసనకు దిగింది. ఈ సందర్భంగా సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బాబురావు (CPM Leader Baburao) మాట్లాడుతూ.. ప్రజల ప్రాణాలను మోదీ ప్రభుత్వం (Modi Government) బలిగొందని విమర్శించారు. కవచ్ లేకపోవడం వల్లే ఒడిశా రైలు ప్రమాదం సంభవించిందని ఆరోపించారు. జెండాలు ఊపి వందేభారత్ రైళ్లు ప్రారంభించడం కాదు ప్రజల ప్రాణాలను కాపాడాలని హితవుపలికారు. ప్రచార ఆర్భాటాల కోసమే బీజేపీ (BJP) పరితపిస్తోందని మండిపడ్డారు. మృతి చెందిన కుటుంబాలకు రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేశారు. రైల్వేను‌ ప్రైవేటీకరణ చేస్తే ఇలాంటి ప్రమాదాలే జరుగుతాయన్నారు. మోడీ మాయలు ఆపి ప్రజలకు మేలు‌ చేసే పనులు‌ చేయాలని బాబురావు వ్యాఖ్యలు చేశారు.

కాగా.. ఒడిశాలో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో మొత్తం 275 మంది చనిపోయినట్లు ఒడిశా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రదీప్ అధికారికంగా ప్రకటించారు. కొన్ని మృతదేహాలను రెండుసార్లు లెక్కించడం వల్ల మరణాల సంఖ్య 288గా వచ్చిందని చెప్పారు. 108 మృతదేహాలను గుర్తించి వారి బంధువులకు అప్పగించామని.. మిగిలిన 167 మృతదేహాలను గుర్తించాల్సి ఉందని తెలిపారు. ప్రత్యేక వైద్య బృందం డీఎన్‌ఏ పరీక్షలు చేసి మృతదేహాన్ని గుర్తించే ప్రక్రియను ప్రారంభించిందన్నారు. అలాగే ఈ ప్రమాదంలో మొత్తం 1175 మంది గాయపడగా... వీరిలో 336 మంది చికిత్స అనంతరం డిశ్చార్జి అయ్యారని తెలిపారు. ప్రస్తుతం 382 మంది క్షతగాత్రులు రాష్ట్రంలోని వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని సీఎస్ ప్రదీప్ జేనా వెల్లడించారు.

Updated Date - 2023-06-05T10:45:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising