CRDA: గెజిట్ నెం.1410 డ్రాఫ్ట్ నోటిఫికేషన్‌పై సీఆర్‌డీఏ విచారణ
ABN, First Publish Date - 2023-03-21T19:16:16+05:30
గెజిట్ నెం.1410 డ్రాఫ్ట్ నోటిఫికేషన్‌పై సీఆర్‌డీఏ (CRDA) విచారణ ఇచ్చింది. ఆర్5 జోన్‌పై గతంలో డ్రాఫ్ట్ నోటిఫికేషన్ (Draft Notification) సీఆర్‌డీఏ
అమరావతి: గెజిట్ నెం.1410 డ్రాఫ్ట్ నోటిఫికేషన్‌పై సీఆర్‌డీఏ (CRDA) విచారణ ఇచ్చింది. ఆర్5 జోన్‌పై గతంలో డ్రాఫ్ట్ నోటిఫికేషన్ (Draft Notification) సీఆర్‌డీఏ విడుదల చేసింది. కేంద్ర ప్రభుత్వ గృహనిర్మాణ స్కీమ్ అమలులో భాగంగా.. రాజధానిలో ఆర్5 జోన్ ఏర్పాటు చేస్తున్నట్టు డ్రాప్ట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. మంగళగిరి మండలం (Mangalagiri Mandal) కృష్ణాయపాలెం, నిడమర్రు, కురగల్లు, తుళ్ళూరు మండలం మందడం, ఐనవోలులోని 900.97 ఎకరాలను R5 జోన్‌గా మార్చుతూ డ్రాప్ట్ నోటిఫికేషన్ ఇచ్చారు. డ్రాప్ట్ నోటిఫికేషన్‌పై గ్రామాల్లో స్థానిక సంస్ధల.. ప్రత్యేకాధికారుల అనుమతి సరిపోతుందని ఏపీ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ప్రభుత్వ ఉత్తర్వులపై అమరావతి రైతులు (Amaravati Farmers) హైకోర్టును ఆశ్రయించారు. గ్రామ సభలు నిర్వహించాలని న్యాయస్థానం ఆదేశించింది. గ్రామ సభల్లో ప్రభుత్వ నిర్ణయాన్ని గ్రామస్తులు వ్యతిరేకించారు. విడివిడిగా కూడా ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా అమరావతి రైతులు సీఆర్‌డీఏకు అభిప్రాయాలు చెప్పారు. రైతుల అభ్యంతరాలను బేఖాతరు చేసి ఆర్5 ఫైనల్ గెజిట్‌ను ప్రభుత్వం విడుదల చేసింది. ప్రభుత్వ నిర్ణయంపై రాజధాని ప్రాంత రైతులు మండిపడుతున్నారు.
Updated Date - 2023-03-21T19:16:16+05:30 IST