Nara Lokesh: జనసంద్రంగా జమ్మలమడుగు... లోకేశ్‌ను చూసేందుకు ఎగబడ్డ జనం
ABN, First Publish Date - 2023-05-30T17:52:44+05:30
జమ్మలమడుగు (Jammalamadugu) జనసంద్రంగా మారింది. టీడీపీ నేత నారా లోకేశ్ (Nara Lokesh)ను చూసేందుకు మహిళలు, వృద్దులు, రైతులు భారీగా రోడ్లపైకి వచ్చారు.
జమ్మలమడుగు: జమ్మలమడుగు (Jammalamadugu) జనసంద్రంగా మారింది. టీడీపీ నేత నారా లోకేశ్ (Nara Lokesh)ను చూసేందుకు మహిళలు, వృద్దులు, రైతులు భారీగా రోడ్లపైకి వచ్చారు. రోడ్డుకు ఇరువైపులా ఉన్న భవనాల పైకి ఎక్కి లోకేశ్‌కు ప్రజలు అభివాదం చేశారు. ప్రతి ఒక్కరినీ కలుస్తూ వారి సమస్యలు తెలుసుకుంటూ యువనేత భరోసా ఇస్తున్నారు. జమ్మలమడుగు శివారు క్యాంప్ సైట్ నుండి 111వ రోజు యువగళం పాదయాత్ర (Yuvagalam Padayatra) లోకేశ్ ప్రారంభించారు. ఈ నెల 23న లోకేశ్ పాదయాత్ర జమ్మలమడుగు మండలంలోని పెద్దముడియం మండలం చేరింది. 24, 25 తేదీల్లో లోకేశ్ పాదయాత్ర నిర్వహించారు. రాజమండ్రిలో జరిగిన మహానాడు కారణంగా నాలుగురోజులు పాదయాత్రకు విరామం ఇచ్చారు. విజయవాడ (Vijayawada) నుంచి ప్రత్యేక విమానంలో సోమవారం సాయంత్రం కడప (Kadapa) విమానాశ్రయం చేరుకున్నారు. అక్కడి నుంచి ఆయన రోడ్డుమార్గాన జమ్మలమడుగు శివారులో ఏర్పాటు చేసిన విడిదికేంద్రానికి చేరుకుని బస చేశారు.
నేటి పాదయాత్ర ఇలా
మంగళవారం సాయంత్రం 4గంటలకు జమ్మలమడుగు శివారులోని విడిది కేంద్రం నుంచి 111వ రోజు పాదయాత్రను లోకేశ్ మొదలుపెట్టారు. 4.20కి పెద్దపసుపుల మోటు వద్ద స్థానికులతో లోకేశ్ మాటామంతి నిర్వహించారు. ఈ సాయంత్రం సంజామల మోటు వద్ద బహిరంగసభలో ఆయన ప్రసంగిస్తారు. ఆ తర్వాత జమ్మలమడుగు పాతబస్టాండు గాంధీ విగ్రహుం వద్ద స్థానికులతో మాటామంతి, 6.15కు కన్నెలూరు క్రాస్ వద్ద స్థానికులతో సమావేశం, 8.15కు ధర్మవరం క్రాస్ వద్ద స్థానికులతో మాటామంతి, 9గంటలకు శేశారెడ్డిపల్లె పాలకోవ సెంటరులో స్థానికులతో మాటామంతి, 9.30కు దేవగుడి సుంకుంలాంబ దేవాలయం వద్ద విడిది కేంద్రంలో బస చేస్తారు.
Updated Date - 2023-05-30T17:52:44+05:30 IST