ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Fraud: లైక్‌లు కొట్టమన్నారు.. లక్షలు దోచేశారు..

ABN, First Publish Date - 2023-08-26T13:52:17+05:30

ఇటీవల సైబర్ మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయి.

ఎన్టీఆర్: ఇటీవల సైబర్ మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయి. గిఫ్ట్‌లు వచ్చాయని, డబ్బులు ఇస్తామంటూ ఇలా పలురకాలకు అమాయకులను నమ్మించి సైబర్ కేటుగాళ్లు లక్షలు దోస్తున్నారు. సైబర్ నేరాలపై పోలీసులు అవగాహన కల్పిస్తున్నప్పటికీ అనేక మంది మోసపోతూనే ఉన్నారు. తాజాగా ఇలాంటి ఘటనే ఎన్టీఆర్ జిల్లాలో చోటు చేసుకుంది. టెలిగ్రామ్‌లో మెసేజ్ వచ్చిందని లైక్‌లు కొట్టాలంటూ ఓ యువకుడిని నమ్మించి అతడి వద్ద నుంచి లక్షలు దోచేశారు కేటుగాళ్లు. వత్సవాయి మండలం పోలంపల్లికి చెందిన రవి కిషోర్‌కు గత నెల 31న ఒక టెలిగ్రామ్‌లో మెసేజ్ వచ్చింది. దానికి స్పందించిన యువకుడు వారితో మాట్లాడుతుండగా తాము పంపిన టెలిగ్రామ్ లింకు ఓపెన్ చేసి లైక్ కొడితే డబ్బులు ఇస్తామని తెలిపారు. ఈ విషయాన్ని నమ్మిన యువకుడు తనకు వచ్చిన లైక్ కొట్టగానే రూ.150 వేశారు. ఆపై పెట్టుబడి పెడితే భారీ లాభాలు వస్తాయని నమ్మించి అతని వద్ద నుంచి దాదాపు రూ. 23 లక్షల వరకు వసూలు చేశారు. ఇంకా పంపించాలని అడగడంతో మోసపోయానని గుర్తించి ఆ యువకుడు పోలీసులను ఆశ్రయించాడు. ఈ విషయంపై విజయవాడలోని సైబర్ క్రైమ్ పోలీసులకు యువకుడు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Updated Date - 2023-08-26T13:52:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising