ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Deputy CM : న్యాయస్థానాలు భయపడి వీరికి బెయిల్ మంజూరు చెయ్యాలా..?

ABN, First Publish Date - 2023-10-14T12:10:43+05:30

మానవతా దృక్పథంతో మా ప్రభుత్వం టీడీపీ అధినేత చంద్రబాబుకి జైల్లో అన్ని సౌకర్యలను కల్పిస్తోందని డిప్యూటీ సీఎం నారాయణస్వామి అన్నారు. ఓ ఆర్థిక నేరస్థుడికి జైల్లో ఇన్ని సౌకర్యాలను కల్పించడం తాను ఎప్పుడు చూడలేదన్నారు.

తిరుమల : మానవతా దృక్పథంతో మా ప్రభుత్వం టీడీపీ అధినేత చంద్రబాబుకి జైల్లో అన్ని సౌకర్యలను కల్పిస్తోందని డిప్యూటీ సీఎం నారాయణస్వామి అన్నారు. ఓ ఆర్థిక నేరస్థుడికి జైల్లో ఇన్ని సౌకర్యాలను కల్పించడం తాను ఎప్పుడు చూడలేదన్నారు. న్యాయస్థానాలు, ప్రభుత్వ న్యాయవాదుల పైన దౌర్జన్యం చేస్తున్నారన్నారు. ఓ కులానికి సంబంధించిన వ్యక్తి ఆర్థిక నేరాలు చేసినా.. శిక్ష పడకూడదని ఆందోళనలు చేస్తున్నారన్నారు. న్యాయస్థానాలు భయపడి వీరికి బెయిల్ మంజూరు చెయ్యాలా..? అని నారాయణ స్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో జయలలిత, లాలూ ప్రసాద్ యాదవ్ జైలుకి వెళ్ళలేదా..? అని ప్రశ్నించారు. బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి టీడీపీకీ కోవర్ట్‌గా పని చేస్తున్నారని ఆరోపించారు. అవినీతి పై పోరాటం చేస్తానన్న పవన్ కళ్యాణ్.. బాబుకి మద్దతు ఇస్తున్నాడని డిప్యూటీ సీఎం నారాయణ స్వామి అన్నారు.

Updated Date - 2023-10-14T12:10:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising