ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

TDP MP's: పార్లమెంట్ ఆవరణలో టీడీపీ ఎంపీల ధర్నా.. పాల్గొన్న లోకేశ్‌

ABN, First Publish Date - 2023-09-18T11:21:40+05:30

పార్లమెంట్ ఆవరణలో టీడీపీ ఎంపీలు సోమవారం ఉదయం ధర్నాకు దిగారు. పార్లమెంటులోని గాంధీ విగ్రహం వద్ద ఎంపీలు నిరసన వ్యక్తం చేశారు. ఎంపీలతో పాటు టీడీపీ మాజీ ఎంపీలు కూడా ధర్నాలో పాల్గొన్నారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పార్లమెంట్ చేరుకున్నారు.

న్యూఢిల్లీ: పార్లమెంట్ (Parliament) ఆవరణలో టీడీపీ ఎంపీలు (TDP MPs) సోమవారం ఉదయం ధర్నాకు దిగారు. పార్లమెంటులోని గాంధీ విగ్రహం వద్ద ఎంపీలు నిరసన వ్యక్తం చేశారు. ఎంపీలతో పాటు టీడీపీ మాజీ ఎంపీలు కూడా ధర్నాలో పాల్గొన్నారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ (TDP Leader Nara Lokesh) పార్లమెంట్‌కు చేరుకుని టీడీపీ ఎంపీలతో కలిసి ఆందోళనలో పాల్గొన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్‌ను (Chandrababu Arrest) టీడీపీ ఎంపీలు తీవ్రంగా ఖండిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని, అక్రమ కేసులు ఎత్తివేయాలని నినాదాలు చేశారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని, ఏపీని రక్షించాలి అంటూ ఎంపీ నినాదాలు చేస్తున్నారు. డటీడీపీ ఎంపీలతో పాటు మాజీ ఎంపీలు, ముఖ్య నేతలు ధర్నాలో పాల్గొన్నారు.


చంద్రబాబు అరెస్ట్‌కు నిరసనగా పార్టీలకు అతీతంగా పార్లమెంట్ వద్ద ధర్నా నిర్వహిస్తున్నట్లు ఎంపీ రఘురామకృష్ణరాజు (MP Raghurama Krishna raju) తెలిపారు. ఏపీలో ప్రజాస్వామ్యాన్ని ఎలా తుంగలో తొక్కారో ప్రజలకు తెలియజేయాలన్నారు. కేవలం ఎన్నికల సమీపిస్తున్నాయని ప్రతిపక్ష నేతపై చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. టీడీపీ ఎంపీల నిరసనకు మద్దతు తెలుపుతున్నట్లు రఘురామ వెల్లడించారు.

చంద్రబాబు అక్రమ అరెస్ట్‌కు నిరసనగా పార్లమెంటు ఆవరణలో ఆందోళన చేస్తున్నట్లు ఎంపీ గల్లా జయదేవ్ (MP Galla Jayadev) తెలిపారు. చంద్రబాబు అక్రమ అరెస్ట్‌ను ఖండిస్తున్నామన్నారు. ఏపీ జరుగుతున్న పరిణామాలను ప్రజలకు తెలియజేసేందుకు నిరసన చేస్తున్నట్లు చెప్పారు.

చంద్రబాబు అక్రమ అరెస్ట్‌ను తీవ్రంగా ఖండిస్తున్నామని ఎంపీ కేశినేని (MP Kesineni) అన్నారు. 45ఏళ్లు ఎలాంటి మచ్చలేని చంద్రబాబు చరిత్రను నాశనం చేసేందుకు జగన్ (CM Jagan) ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.

Updated Date - 2023-09-18T11:24:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising