ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

DIG: చంద్రబాబు భద్రతపై జైళ్ల శాఖ డీఐజీ ఏమన్నారంటే..

ABN, First Publish Date - 2023-10-13T19:19:18+05:30

రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు (Nara Chandrababu Naidu) ఆరోగ్యంపై జైళ్ల శాఖ డీఐజీ రవి కిరణ్ (Ravi Kiran), తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ పి జగదీష్ మీడియా సమావేశంలో కీలక విషయాలు వెల్లడించారు.

రాజమండ్రి: రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు (Nara Chandrababu Naidu) ఆరోగ్యంపై జైళ్ల శాఖ డీఐజీ రవి కిరణ్ (Ravi Kiran), తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ పి జగదీష్ మీడియా సమావేశంలో కీలక విషయాలు వెల్లడించారు.


"చంద్రబాబు స్నేహ బ్లాక్‌లో ఉన్నారు. ఒక జైలర్ స్థాయి అధికారితో పాటు ఏడుగురు హెడ్ వార్డర్స్, వార్డర్స్ ఉన్నారు. చంద్రబాబు రూంలో ఎనిమిది ప్యాన్లు తిరుగుతున్నాయి. భద్రతపరంగా అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం. చంద్రబాబు జైలుకు వచ్చినప్పుడు 66 కేజీలు ఉన్నారు. ప్రస్తుతం 68 కేజీలకు పెరిగి 67 కేజీలకు తగ్గారు. జైలులో ముగ్గురు వైద్యులు ఉన్నారు. చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైలుకి వచ్చినప్పుడు వాడుతున్న మందులే వాడుతున్నారు. డీ హైడ్రేషన్ కోసం ఓఆర్ఎస్ ఇచ్చాం. శరీరంపై దద్దర్లు రావటం వల్ల రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులతో పరీక్షలు చేయించాం. చంద్రబాబు రిమాండ్ ఖైదీ‌గా అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం. పుడ్ టెస్ట్ చేస్తున్నాం. పుడ్ టెస్ట్ చేసిన 50 నిమిషాల తర్వాత చంద్రబాబుకి అందిస్తున్నాం. డ్రోన్ కెమెరా ఓపెన్ జైలు వరకు వచ్చింది. విచారణ జరుపుతున్నాం. సెంట్రల్ జైలులో చంద్రబాబు ఫోటోలు బయటకు పంపటంపై విచారణ జరుపుతున్నాం. భద్రత వైఫల్యం లేదు. చంద్రబాబుకు ఖైదీల ద్వారా ఇబ్బంది లేదు." అని జైళ్ల శాఖ డీఐజీ రవి కిరణ్ అన్నారు.

Updated Date - 2023-10-13T19:25:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising