TTD: ఆరోగ్య వరప్రసాదిని ట్రస్టుకు రూ.కోటి విరాళం
ABN, First Publish Date - 2023-03-05T20:49:53+05:30
టీటీడీ (TTD) శ్రీబాలాజీ ఆరోగ్య వరప్రసాదిని ట్రస్టుకు ఆదివారం రూ.కోటి విరాళంగా అందింది.
తిరుమల: టీటీడీ (TTD) శ్రీబాలాజీ ఆరోగ్య వరప్రసాదిని ట్రస్టుకు ఆదివారం రూ.కోటి విరాళంగా అందింది. హైదరాబాద్ (Hyderabad)కు చెందిన శ్రీవారి భక్తురాలు సరోజినీ వడ్లమూడి ఈవిరాళాన్ని అందజేశారు. ఈ మొత్తానికి సంబంధించిన డీడీలను ఆదివారం ఉదయం తిరుమలలోని దాతల విభాగంలో టీటీడీ సిబ్బందికి దాత అందజేశారు.
తిరుమలేశుడి సేవలో న్యాయమూర్తులు
తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామిని ఆదివారం పలువురు న్యాయమూర్తులు దర్శించుకున్నారు. సుప్రీం కోర్టు న్యాయమూరి జస్టిస్ విక్రమ్‌నాథ్ ఉదయం వీఐపీ బ్రేక్ సమయంలో ఆలయంలోకి వెళ్లారు. ముందుగా ధ్వజస్తంభానికి మొక్కుకుని తర్వాత గర్భాలయంలోని మూలమూర్తిని దర్శించుకున్నారు. అలాగే ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వెంకటరమణ, తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సూర్యపల్ల నంద కూడా వేర్వేరుగా ఆలయంలోకి వెళ్లి శ్రీవారిని దర్శించుకున్నారు. వీరికి రంగనాయక మండపంలో వేదపండితులు ఆశీర్వచనం చేయగా, అధికారులు లడ్డూప్రసాదాలు అందజేశారు.
Updated Date - 2023-03-05T20:49:53+05:30 IST