ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

TTD: శ్రీవారి ఆలయంపై డ్రోన్‌ కలకలం .. కిరణ్‌పై కేసు నమోదు

ABN, First Publish Date - 2023-01-21T21:42:23+05:30

తిరుమల (Tirumala) శ్రీవారి ఆలయంపై నిబంధనలకు విరుద్ధంగా డ్రోన్‌ను పంపి వీడియో రికార్డు చేసిన కేసులో కిరణ్‌ అనే..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుమల: తిరుమల (Tirumala) శ్రీవారి ఆలయంపై నిబంధనలకు విరుద్ధంగా డ్రోన్‌ను పంపి వీడియో రికార్డు చేసిన కేసులో కిరణ్‌ అనే వ్యక్తిపై తిరుమల వన్‌టౌన్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. ఐపీసీ 447సెక్షన్‌ కింద ఈ కేసు నమోదు చేశారు. డ్రోన్‌ కెమెరాతో శ్రీవారి ఆలయ దృశ్యాలు చిత్రీకరించినట్టు పోలీసులు ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు. గృహ నివాసా, ఐకాన్‌ ఫ్యాక్ట్‌ అకౌంట్స్‌లో ఈ వీడియోను పోస్ట్‌ చేసినట్టు పేర్కొన్న పోలీసులు ఆలయ భద్రతా నియమాల ఉల్లంఘనతో పాటు అసాంఘిక శక్తులకు ప్రయోజనం చేకూర్చేలా వ్యవహరించినందుకు కేసు నమోదు చేసినట్టు ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు. అయితే కిరణ్‌ ఎవరు, ఏం చేస్తుంటాడనే అంశాలపై దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. సోషల్‌మీడియాలో చేసిన పోస్ట్‌ ఆధారంగా అతనిపై కేసు నమోదు చేశామన్నారు.

Updated Date - 2023-01-21T21:42:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising