ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

కీలక తీర్మానాలకు దుర్గ గుడి పాలకమండలి గ్రీన్ సిగ్నల్

ABN, First Publish Date - 2023-08-28T16:09:41+05:30

దుర్గగుడి పాలకమండలి సమావేశంలో పలు కీలక తీర్మానాలకు ఆమోదం లభించింది. ఈ సందర్భంగా దుర్గగుడి పాలకమండలి ఛైర్మన్ కర్నాటి రాంబాబు మాట్లాడుతూ.. శివాలయాన్ని త్వరితగతిన భక్తులకు అందుబాటులోకి తెస్తామన్నారు. శివాలయంలో 40 లక్షల అంచనాతో నవగ్రహ మండపం ఏర్పాటు చేస్తామన్నారు.

విజయవాడ : దుర్గగుడి పాలకమండలి సమావేశంలో పలు కీలక తీర్మానాలకు ఆమోదం లభించింది. ఈ సందర్భంగా దుర్గగుడి పాలకమండలి ఛైర్మన్ కర్నాటి రాంబాబు మాట్లాడుతూ.. శివాలయాన్ని త్వరితగతిన భక్తులకు అందుబాటులోకి తెస్తామన్నారు. శివాలయంలో 40 లక్షల అంచనాతో నవగ్రహ మండపం ఏర్పాటు చేస్తామన్నారు. వృద్ధులు,వికలాంగులకు బ్యాటరీ వాహనాలతో పాటు రెండు డీజిల్ వాహనాలు ఏర్పాటు చేస్తామని వెల్లడించారు.

‘‘ఏడాదిలోపు చిన్న పిల్లలతో వచ్చే తల్లులకు ప్రత్యేక క్యూలైన్ ద్వారా దర్శనం కల్పించడం. దూరప్రాంత భక్తుల కోసం మహామండపం మొదటి అంతస్తులో డార్మిటరీ ఏర్పాటు చేయాలని నిర్ణయం. నామమాత్రపు రుసుముతో డార్మిటరీలో బసకు ఏర్పాట్లు . ఫ్లై ఓవర్ మీద వెళ్లే భక్తులకు కనిపించేలా అమ్మవారి చిత్రాలు ఏర్పాటుకు ఆమోదం. బంగారు ఆభరణాల డోనర్స్‌కు అందుబాటులో ఉండేలా మరో గోల్జ్ అప్రైజర్‌ను నియమించాలని నిర్ణయం. అమ్మవారి ఆలయంలో పెళ్లి చేసుకున్న నూతన జంటకు మ్యారేజ్ టిక్కెట్ ఇవ్వాలని నిర్ణయం. అమ్మవారి స్థల పురాణం పై డాక్యుమెంటరీ రూపొందించేందుకు ఆమోదం. త్వరలోనే అందుబాటులోకి దుర్గా ఘాట్‌. అమ్మవారి సేవలను సోషల్ మీడియా,యూట్యూబ్ లో లైవ్ టెలికాస్ట్ ద్వారా విస్తృత ప్రచారం కల్పించడం. టీటీడీ ఎస్వీబీసీ మాదిరిగా దుర్గగుడికి ఎస్‌డీఎంబీసీ ఛానల్‌. రెండు వేల మంది ఒకేసారి అన్న ప్రసాదం స్వీకరించేలా అన్నదాన భవనం’’ వంటి కార్యక్రమాలకు దుర్గగుడి పాలక మండలి ఆమోద ముద్ర వేసింది.

Updated Date - 2023-08-28T16:09:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising