ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Alluri Dist.: అంగన్వాడీ గిరిపోషణ కార్యకర్తల ఆందోళన

ABN, First Publish Date - 2023-07-28T16:27:50+05:30

అల్లూరి జిల్లా: పాడేరు ఐటిడిఏ ఎదుట అంగన్‌వాడి ‘గిరిపోషణ’ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. అంగన్వాడి గిరిపోషణ కార్యకర్తలకు 17 నెలలుగా బకాయి ఉన్న జీతాలను చెల్లించాలని వారు డిమాండ్ చేశారు.

అల్లూరి జిల్లా: పాడేరు ఐటిడిఏ (ITDA) ఎదుట అంగన్‌వాడి (Anganwadi) ‘గిరిపోషణ’ కార్యకర్తలు (Activists) ఆందోళన (Protest) చేపట్టారు. అంగన్వాడి గిరిపోషణ కార్యకర్తలకు 17 నెలలుగా బకాయి ఉన్న జీతాలను చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా అంగన్‌వాడి కేంద్రాలు లేని మారుమూల గిరిజన గ్రామాల్లో గర్భిణీ, బాలింతలు, పిల్లలకు పౌష్టిక ఆహారం అందించుటకు "చంద్రన్న గిరిపోషణ" పథకాన్ని 2018 నవంబర్ నెలలో ప్రారంభించారు. అంగన్వాడి సెంటర్ లేని గ్రామాలలో దగ్గరలో ఉన్న అంగన్‌వాడి కేంద్రం నుంచి పౌష్టిక ఆహారం (గుడ్లు, పాలు, బియ్యం, పప్పు, నూనె) తీసుకుని, కూరగాయలు కొని వంట చేసి పెట్టాలని అందుకు కార్యకర్తలను నియమించారు. లబ్ధిదారుల సంఖ్యను బట్టి నెలకు రూ. 700 నుంచి వెయ్యి రూపాయల వరకు వేతనం చెల్లిస్తామని అప్పుడు అధికారులు తెలిపారు. 2018 నవంబర్ నెల నుంచి 2020 మార్చి వరకు 17 నెలలు విధులు నిర్వహించామన్నారు. వాటికి సంబంధించి ఇంతవరకు జీతాలు చెల్లించలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. పూర్తి సమాచారం అందవలసి ఉంది.

Updated Date - 2023-07-28T16:27:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising