AP News: దేశ చరిత్రలోనే తొలిసారిగా కాకినాడలో మహాశక్తి యాగం..
ABN, First Publish Date - 2023-11-13T16:18:55+05:30
Andhrapradesh: దేశ చరిత్రలో ఇప్పటి వరకు జరగని మహాశక్తి యాగం కాకినాడ శ్రీ పీఠం కేంద్రంగా రేపటి (నవంబర్ 14) నుంచి నెల రోజుల పాటు జరుగుతోందని శ్రీ పీఠం పరిపూర్ణానంద స్వామి తెలిపారు.
కాకినాడ: దేశ చరిత్రలో ఇప్పటివరకు జరగని మహాశక్తి యాగం కాకినాడ శ్రీ పీఠం కేంద్రంగా రేపటి (నవంబర్ 14) నుంచి నెల రోజుల పాటు జరుగుతోందని పరిపూర్ణానంద స్వామి (Paripoornananda swamy) తెలిపారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. పవిత్రమైన కార్తీక మాసంలో ఈ యాగం చేయడం అదృష్టమని, రూ.100 కోట్ల కుంకుమార్చన అనేది ఇప్పటి వరకు ఎక్కడా జరగలేదని ఆయన అన్నారు. ఒకే చోట 12 నుంచి 15 వేల మంది మహిళలు కుంకుమ పూజ చేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయని వివరించారు.
బగళాముఖి అమ్మవారి అనుష్టానం భారతదేశంలో ఇప్పటి వరకు ఎక్కడా జరగలేదని.. ఇది భారత దేశంలో ఒక మైలురాయన్నారు. అతిరుద్ర యాగం కూడా జరుగుతుందని తెలిపారు. మహానక్షత్ర శాంతి కూడా జరుగుతుందన్నారు. ప్రతిరోజూ సాయంత్రం కోటి దీపాలతో పార్వతి పరమేశ్వరులకు హారతి ఇస్తామన్నారు. ఈ యాగం అమ్మ వారి మహాశక్తి జాగరణ కోసమే అని శ్రీపీఠం పరిపూర్ణానంద స్వామి వెల్లడించారు.
Updated Date - 2023-11-13T16:27:52+05:30 IST