Vinayaka chavithi: శ్రీసిద్దిలక్ష్మీ గణపతి ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు
ABN, First Publish Date - 2023-09-18T09:39:04+05:30
వినాయక చవతిని పురస్కరించుకుని శ్రీ సిద్దిలక్ష్మీ గణపతి స్వామి వారి దేవస్థానంలో నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి.
రాజమండ్రి: వినాయక చవతిని పురస్కరించుకుని శ్రీ సిద్దిలక్ష్మీ గణపతి స్వామి వారి దేవస్థానంలో నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. 15 లక్షల కరెన్సీ నోట్లతో గణపయ్యను ఆలంకరించారు. ఆలయంలో పూబంతి గణపతి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ధవళేశ్వరం బ్యారేజ్ నిర్మాణ సమయంలో అవాంతరాలు ఎదురైనప్పుడు సర్ ఆర్థర్ కాటన్ ఈ ఆలయంలోనే మొక్కుకున్నారు. మొక్కు తీరిన తర్వాత 1858లో ఆలయానికి కంచు గంట బహుకరించారు. తూర్పుగోదావరి జిల్లాలో ఏకైక ద్వజస్థంభం కలిగిన ఆలయంగా శ్రీసిద్దిలక్ష్మీ గణపతి స్వామి దేవస్థానం ప్రసిద్ధి చెందింది.
Updated Date - 2023-09-18T09:39:04+05:30 IST