ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Chandrababu Mulakat: జైలులో చంద్రబాబు లీగల్ ములాఖత్‌లకు అధికారుల కోత

ABN, First Publish Date - 2023-10-17T14:35:27+05:30

రాజమండ్రి సెంట్రల్ జైలులో టీడీపీ అధినేత చంద్రబాబు లీగల్ ములాఖత్‌లకు అధికారులు కోత విధించారు. రోజుకు రెండు లీగల్ ములాఖత్‌లను ఒకటికి కుదించారు. చంద్రబాబు ములాఖత్‌ల వల్ల సాధారణ ఖైదీలకు జైలులో ఇబ్బందులు ఎదురవుతున్నాయంటూ అధికారులు వింత సాకులు చెపుతున్నారు. పరిపాలనా కారణాలతో ఇకపై రెండో ములాఖత్ రద్దు చేసినట్లు జైలు అధికారులు లిఖిత పూర్వకంగా తెలిపారు.

అమరావతి: రాజమండ్రి సెంట్రల్ జైలులో టీడీపీ అధినేత చంద్రబాబు (TDP Chief Chandrababu naidu) లీగల్ ములాఖత్‌లకు అధికారులు కోత విధించారు. రోజుకు రెండు లీగల్ ములాఖత్‌లను ఒకటికి కుదించారు. చంద్రబాబు ములాఖత్‌ల వల్ల సాధారణ ఖైదీలకు జైలులో ఇబ్బందులు ఎదురవుతున్నాయంటూ అధికారులు వింత సాకులు చెపుతున్నారు. పరిపాలనా కారణాలతో ఇకపై రెండో ములాఖత్ రద్దు చేసినట్లు జైలు అధికారులు లిఖిత పూర్వకంగా తెలిపారు. ఖైదీల రాకపోకలకు చంద్రబాబు ములాఖత్ వల్ల ఇబ్బంది అంటూ చెప్పడంపై టీడీపీ మండిపడుతోంది. రాజమండ్రి జైల్లో ఐదు వారాలుగా లేని భద్రతా ఇబ్బంది.. ఇప్పుడే ఎందుకు వచ్చింది అంటూ ప్రభుత్వం చెపుతున్న కారణాలపై టీడీపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. చంద్రబాబుపై కేసుల మీద కేసులు పెడుతూ లీగల్ ములాఖత్‌‌లను కూడా కుదించడం కుట్రే అంటని టీడీపీ వ్యాఖ్యానించింది. తనపై అక్రమ కేసుల విషయంలో ఏసీబీ, హైకోర్టు, సుప్రీం కోర్టులలో చంద్రబాబు పోరాడుతున్నారని.. ఈ సమయంలో న్యాయవాదులతో సంప్రదింపులు అత్యంత కీలకం అని కుటుంబసభ్యులు చెబుతున్నారు. చంద్రబాబు న్యాయ పోరాటంలో జాప్యం జరిగేలా ప్రభుత్వం ఈ తరహా కుట్రలు అంటూ కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు మండిపడుతున్నారు.

Updated Date - 2023-10-17T14:44:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising