ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

AP News: టీడీపీ నేతల అక్రమ అరెస్ట్‌కు నిరసనగా రాజమండ్రిలో అఖిపక్షం భేటీ

ABN, First Publish Date - 2023-05-08T12:15:39+05:30

టీడీపీ నేతలు ఆదిరెడ్డి అప్పారావు, వాసుల అక్రమ అరెస్ట్‌కు నిరసనగా రాజమండ్రిలో సోమవారం అఖిలపక్ష సమావేశమైంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాజమండ్రి: టీడీపీ నేతలు ఆదిరెడ్డి అప్పారావు, వాసుల అక్రమ అరెస్ట్‌కు నిరసనగా రాజమండ్రిలో సోమవారం అఖిలపక్ష సమావేశమైంది. ఈ సమావేశానికి హాజరైన మాజీ ఎంపీ హర్షకుమార్, సీపీఐ జిల్లా కార్యదర్శి మదు, మానవ హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ముప్పాళ్ల సుబ్బారావు, కాంగ్రెస్ నగర అధ్యక్షుడు బాలేపల్లి మురళీధర్, టీడీపీ రాష్ట్ర ఉపాద్యక్షుడు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, జనసేన జిల్లా అధ్యక్షుడు కందుల దుర్గేష్, రాష్టీయ ప్రజా కాంగ్రెస్ అధ్యక్షుడు మేడా శ్రీనివాస్, సీపీఎం, ఆమ్ ఆద్మీ హాజరయ్యారు. ఈ సందర్భంగా సీనియర్ న్యాయవాది ముప్పాళ్ల సుబ్బారావు మాట్లాడుతూ... ఆదిరెడ్డి కుటుంబ సభ్యుల అరెస్ట్‌లో సీఐడీ పోలీసులు హక్కుల ఉల్లంఘనకు పాల్పడ్డారన్నారు. వర్తించని సెక్షన్లు ఆదిరెడ్డి అప్పారావు, వాసులపై సీఐడీ పోలీసులు నమోదు చేశారని మండిపడ్డారు. రాజకీయ ప్రతికారంతో ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారిపై అక్రమ కేసులు బనాయిస్తున్నారన్నారు. వైసీపీ చిట్ పండ్ కంపెనీలపై ఎందుకు కేసులు పెట్టడం లేదని ప్రశ్నించారు.

టీడీపీ రాష్ట్ర ఉపాద్యక్షుడు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. సీఐడీ పోలీసులతో జగన్ బలమైన టీడీపీ నేతలను అక్రమంగా అరెస్ట్ చేయిస్తున్నారన్నారు. వివేకా హత్య కేసులో నిందితులను మాత్రం జగన్ అరెస్ట్ చేయించటం లేదని విమర్శించారు. ఏపీలో అంబేద్కర్ రాజ్యాంగం అమలుకావటం లేదన్నారు. సీఐడీ, సీబీఐలు జగన్ కనుసన్ననలో పనిచేస్తున్నాయని వ్యాఖ్యలు చేశారు.

Updated Date - 2023-05-08T12:15:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising