ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Amaravati: నేటి నుంచి టీడీపీ-జనసేన సమన్వయ సమావేశాలు

ABN, First Publish Date - 2023-10-29T08:16:11+05:30

అమరావతి: తెలుగుదేశం-జనసేన సమన్వయ సమావేశాలు ఆదివారం నుంచి జరగనున్నాయి. 29, 30, 31వ తేదీల్లో జిల్లాల్లో సమన్వయ సమావేశాలు జరుగుతాయి. ఈ సమన్వయ సమావేశాలకు పర్యవేక్షణ నిమిత్తం రెండు పార్టీల నుంచి ఒక్కొక్కరు చొప్పున సీనియర్ నేతలు హాజరవుతారు.

అమరావతి: తెలుగుదేశం-జనసేన సమన్వయ సమావేశాలు ఆదివారం నుంచి జరగనున్నాయి. 29, 30, 31వ తేదీల్లో జిల్లాల్లో సమన్వయ సమావేశాలు జరుగుతాయి. ఈ సమన్వయ సమావేశాలకు పర్యవేక్షణ నిమిత్తం రెండు పార్టీల నుంచి ఒక్కొక్కరు చొప్పున సీనియర్ నేతలు హాజరవుతారు. ఆదివారం శ్రీకాకుళం, విజయనగరం, తూర్పుగోదావరి, ప్రకాశం, అనంతపురం జిల్లాలు; సోమవారం పశ్చిమ గోదావరి, కృష్ణా, చిత్తూరు, కడప జిల్లాలు; మంగళవారం విశాఖ, గుంటూరు, నెల్లూరు, కర్నూలు జిల్లాల్లో సమన్వయ సమావేశాలు జరగనున్నాయి.

కళ్లు తెరిపిద్దాం పేరుతో ఆదివారం మరో నిరసన కార్యక్రమానికి తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పిలుపిచ్చారు. ఇవాళ రాత్రి 7 గంటల నుంచి 7.05 గంటల మధ్య నిరసన కార్యక్రమం జరగనుంది. అరాచక పాలన సాగిస్తున్న జగనాసురుడికి కళ్లు తెరిపిద్దామని లోకేష్ అన్నారు.

కాగా టీడీపీ- జనసేన పొత్తు తర్వాత ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో రెండు పార్టీల నేతలు కాకినాడలో తొలిసారిగా ఆదివారం భేటీ కానున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు కాకినాడ సాంబమూర్తినగర్‌ 5వ వీధిలోని వీఎస్‌ఆర్‌ కన్వెన్షన్‌ హాల్‌లో కీలక సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి ఉమ్మడి జిల్లా పరిధిలోని 19 నియోజకవర్గాల ఇరు పార్టీల నేతలు, ఇన్‌చార్జిలు హాజరుకానున్నారు. సమావేశంలో ప్రధానంగా వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలతో చంద్రబాబు అక్రమ అరెస్టు పరిణామాలను గడపగడపకు తీసుకెళ్లేందుకు కార్యాచరణ రూపొందించనున్నారు. గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు సమన్వయం దిశగా ఉమ్మడి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడమే లక్ష్యంగా టీడీపీ, జనసేనలు సమన్వయంతో ముందుకు వెళ్లాలని నిర్ణయించిన నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఈనెల 29 నుంచి 31 వరకు మూడు రోజుల పాటు ఉమ్మడి జిల్లాల వారీగా ఇరుపార్టీల సమన్వయంతో సమావేశాలు జరపనున్నారు. ఇరుపార్టీల నేతల అభిప్రాయాలు, సలహాలు, సూచనలతో పాటు భవిష్యత్‌ కార్యక్రమాలపై ఉమ్మడిగా చర్చించి నిర్ణయాలు తీసుకోనున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో ఇరుపార్టీల నేతల భేటీ అధికార వైసీపీలో గుబులు రేపుతోంది. టీడీపీ, జనసేన కలయికతో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో మనుగడ సాగించడం కష్టమనే భావనలో వైసీపీ నేతలు ఉన్నారు.

Updated Date - 2023-10-29T08:16:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising