ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Undavalli: మార్గదర్శిపై జగన్ కక్షతోనే చేస్తున్నారు.. తప్పేంటి?..

ABN, First Publish Date - 2023-08-09T13:16:16+05:30

రాజమండ్రి: కళాంజలి విషయంలో జర్నలిస్టు ఏబీకే ప్రసాద్‌నే ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు కోర్టుల చుట్టూ తిప్పారని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు.

రాజమండ్రి: కళాంజలి విషయంలో జర్నలిస్టు ఏబీకే ప్రసాద్‌నే ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు (Ramoji Rao) కోర్టుల చుట్టూ తిప్పారని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ (Undavalli Arun Kumar) అన్నారు. ఈ సందర్భంగా బుధవారం ఆయన రాజమండ్రిలో మీడియాతో సమావేశంలో మాట్లాడుతూ మార్గదర్శి చిట్ పండ్ కేసులో రామోజీరావు, శైలజా కిరణ్‌లను అధికారులు ప్రశ్నించిన వీడియో బయటపెట్టాలన్నారు. ఏపీ ప్రభుత్వం (AP Govt.) కన్నా రామోజీరావుకు పలుకుబడి ఉందని, ఏపీలో ప్రజలు కట్టిన సొమ్ముకు మార్గదర్శి చిట్ పండ్ కంపెనీ (Margadarshi Chit Fund Company) వద్ద ఉన్న సొమ్ముకు వ్యత్యాసం ఉందన్నారు. మార్గదర్శిపై సీఎం జగన్ (CM Jagan) కక్షతోనే చేస్తున్నారని, తప్పేంటని ప్రశ్నించారు.

రామోజీ పిలింసిటీలో రెండు వేల ఎకరాల భూములు నిబంధనలకు వ్యతిరేకంగా కొనుగోలు చేశారని ఉండవల్లి ఆరోపించారు. న్యాయ వ్యవస్థలో మార్పులు రావాలని ఆకాంక్షించారు. పేదవాడికి న్యాయం జరగటం లేదని, నిజాలు బయటపెట్టాల్సిన భాద్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ప్రభుత్వానికి చేతకాక రామోజీరావుపై చర్యలు తీసుకోవటం లేదని విమర్శించారు. ఏపీలో ఒక్క చిట్ పండ్ కంపెనీ కూడా నిబంధనల ప్రకారం నడపటం లేదని ఉండవల్లి అరుణ్ కుమార్ ఆరోపించారు.

Updated Date - 2023-08-09T13:16:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising