ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Eluru: వాహనాలు ఆపి డబ్బులు వసూళ్లు చేస్తున్న గుజరాత్ యువతులు

ABN, First Publish Date - 2023-08-18T16:39:34+05:30

ఏలూరు: నగరంలో వాహనాలు ఆపి గుజరాత్‌కు చెందిన యువతులు బలవంతంగా డబ్బులు వసూళ్లకు పాల్పడుతున్నారు. ఏలూరు కలెక్టరేట్ జన్మభూమి పార్కుల వద్ద వాహనదారుల నుంచి యువతులు బలవంతంగా డబ్బులు వసూలు చేస్తున్నారు.

ఏలూరు: నగరంలో వాహనాలు ఆపి గుజరాత్‌ (Gujarath)కు చెందిన యువతులు (Young Womens) బలవంతంగా డబ్బులు వసూళ్లకు (Forced Money Collections) పాల్పడుతున్నారు. ఏలూరు కలెక్టరేట్ జన్మభూమి పార్కుల వద్ద వాహనదారుల నుంచి యువతులు బలవంతంగా డబ్బులు వసూలు చేస్తున్నారు. దీంతో వాహనదారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వసూళ్లకు పాల్పడుతున్న 20 మంది యువతులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

గుజరాత్ యువతులు ఒక్కోక్కరి వద్ద నుంచి కనీసం రూ. 2 వందల వరకు వసూలు చేస్తున్నట్లు సమాచారం. అలాగే డబ్బులు ఎవరు ఇస్తున్నారో వాళ్ల పేర్లు కూడా రాసుకుంటున్నారు. అయితే వాళ్లు బలవంతంగా డబ్బులు వసూళ్లు చేయడానికి గల కారణాలు చెబుతున్నారు. తాము గుజరాత్‌లో ప్రకృతి వైపరీత్యంవల్ల పూర్తిగా నష్టపోయామని, నిలువ నీడలేకుండా పోయిందని చెబుతున్నారు. అలాగే తాము గుజరాత్‌లో 150 మంది వికలాంగ పిల్లలను చూస్తున్నామని.. వాళ్లందరి కోసం ఆర్థిక సాయం చేయాలని కోరుతూ ఒక లెటర్ తయారు చేశారు. ఆ లేఖను వాహనదారులకు చూపిస్తూ డబ్బులు బలవంతంగా వసూలు చేస్తున్నారు. కొంతమంది ఇవ్వడానికి నిరాకరిస్తే వాళ్ల వద్దనుంచి బలవంతంగా వసూలు చేస్తుండడంతో వారు పోలీసుల దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వాళ్లకు నేర చరిత్ర ఉందా? లేక నిజంగానే వాళ్లు ప్రకృతి వైపరీత్యంవల్ల నష్టపోయారా? అన్నదానిపై దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2023-08-18T16:39:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising