ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Chandrababu: రావణాసురిడితో పోరాటం: చంద్రబాబు

ABN, First Publish Date - 2023-02-24T19:56:29+05:30

పార్టీపై శ్రద్ధపెట్టినప్పుడు ఓటమి ఎరగం. మనల్ని ఓడించే శక్తి అంటూ ఏదీ లేదు. ఒకప్పుడు రాజకీయాల్లో పోరాడేవాళ్ళం. ఇప్పుడేమో రాష్ట్రంలోని వింత జంతువులతో పోరాడుతున్నాం.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏలూరు: ‘పార్టీపై శ్రద్ధపెట్టినప్పుడు ఓటమి ఎరగం. మనల్ని ఓడించే శక్తి అంటూ ఏదీ లేదు. ఒకప్పుడు రాజకీయాల్లో పోరాడేవాళ్ళం. ఇప్పుడేమో రాష్ట్రంలోని వింత జంతువులతో పోరాడుతున్నాం. మనుషులకు ఓ మనస్సు ఉంటుంది. సైకో.. కింద ఉన్న వారికి అలాంటిదేమీ లేదు’ అని టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) ధ్వజమెత్తారు. ఒకప్పటి రాజకీయాలకు, ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్న వాటికి పొంతనే లేదన్నారు. రావణాసురిడితో పోరాటం చేస్తున్నామని చంద్రబాబు తెలిపారు. శుక్రవారం ఏలూరు (Eluru)లో జరిగిన జోన్‌-2 తెలుగుదేశం శిక్షణా శిబిరంలో ఆయన పాలు పంచుకున్నారు. క్లస్టర్‌, యూనిట్‌, బూత్‌ ఇన్‌చార్జ్‌లతో ఆయన ముఖాముఖి భేటీ అయ్యారు. పార్టీ నియోజకవర్గ కన్వీనర్లు, మండల అధ్యక్షులతో పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు ఏ మేరకు ఎంత పనిచేశారో గణాంకాలతో వెల్లడించే ప్రయత్నం చేశారు.

టీడీపీకి కార్యకర్తలే బలం.. వారే ఆస్తి

కార్యకర్తలనుకుంటే పార్టీ తేలిగ్గా గెలుస్తుందన్నారు. హూ కిల్డ్‌ బాబాయ్‌ అని అడిగితే గూగుల్‌ చెప్పేస్తుంది.. ఎవరు చంపేశారో. గూగుల్‌ టేక్‌ అవుట్‌తో బండారం బట్టలైంది. టెక్నాలజీదే ఎప్పుడూ విజయం. జగన్‌రెడ్డికి ఇది అర్ధం కాదన్నారు. మనిషిని చంపేసి గుండెపోటుతో చనిపోయాడని ప్రచారం చేశారు. నారా వారి రక్త చరిత్ర పేరిట నా మీద నిందలు మోపారు. అందరినీ మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వివేకానందరెడ్డి (Vivekananda Reddy) కూతురు సునీత విచారణకు పట్టుపడడం, పోస్టుమార్టం కోరడం, ఆ తదుపరి అసలు రహస్యం కాస్తా బయటపడినట్టయ్యింది. వివేకానందరెడ్డి కేసులో ధైర్యంగా పోరాడిన ఆడబిడ్డలను అభినందించాలన్నారు. సాక్షి గుమస్తా సజ్జల ఏది వస్తే అది వాగేస్తారు. నేనేమో ఏదో మేనేజ్‌ చేశానని ప్రగల్బాలు పలుకుతున్నాడని దుయ్యబట్టారు. సీబీఐ విచారణ జరుపుతుంటే అదంతా తప్పని సీఎం సలహాదారు అంటారు. రూ.40 కోట్లు వివేక హత్యకు సుపారీగా ఇచ్చారు. ఆ డబ్బులు ఎవరు ఇచ్చారు, ఎక్కడి నుంచి వచ్చాయంటూ నిలదీస్తూనే సజ్జల సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారంటూ విరుచుకుపడ్డారు. వివేకానందరెడ్డి హత్య ముమ్మాటిని అంతఃపుర హత్యగా చంద్రబాబు అభివర్ణించారు.

రివర్స్‌ మేన్‌తో అంతా రివర్స్‌

‘పోలవరం (Polavaram) రాష్ట్రానికి ఒక వరం. 72 శాతం మన ప్రభుత్వంలోనే పూర్తి చేయగలిగామన్న విషయం అందరికీ తెలిసిందే. మనమే అధికారంలో ఉంటే 2020 జూన్‌ నాటికే పూర్తయ్యి ఉండేది. రివర్స్‌ మేన్‌ వచ్చాడు అంతా రివర్స్‌ అయ్యింది. ఒక మూర్ఖత్వంతో పోలవరం గోదావరిలో కలిసిపోయే పరిస్థితి వచ్చింది. మొత్తమంతా నాశనమైంది’ అంటూ జగన్‌నుద్దేశించి తీవ్రస్థాయిలో వాక్భాణాలు సంధించారు. పోలవరం విషయంలో వైసీపీని దోషిగా నిలబెట్టాల్సిందేనని స్పష్టం చేశారు. టీడీపీ హయాంలో ఇరిగేషన్‌లో రూ.64 వేల కోట్లు ఖర్చు చేశామని, మరో రూ.70 వేల కోట్లు ఖర్చు చేసి ఉంటే రాష్ట్రం మొత్తం మీద నదుల అనుసంధానం పూర్తయ్యి ఉండేదని చంద్రబాబు వివరించారు.

Updated Date - 2023-02-24T19:56:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising