ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

TTD: తిరుమల క్షేత్రంపై మళ్లీ ప్రయాణించిన విమానం

ABN, First Publish Date - 2023-06-09T21:55:53+05:30

తిరుమల (Tirumala) క్షేత్రం మీదుగా ప్రయాణించే విమానాలు అధికమవు తున్నాయి. గురువారం ఉదయం వరుసగా మూడు విమానాలు క్షేత్రానికి సమీపంగా ప్రయాణించడం తెలిసిందే.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుమల: తిరుమల (Tirumala) క్షేత్రం మీదుగా ప్రయాణించే విమానాలు అధికమవు తున్నాయి. గురువారం ఉదయం వరుసగా మూడు విమానాలు క్షేత్రానికి సమీపంగా ప్రయాణించడం తెలిసిందే. శుక్రవారం మరో విమానం శ్రీవారి ఆలయానికి అతిసమీపంగా, తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనం మీదుగా ప్రయాణించింది. సాధారణంగా శ్రీవారి ఆలయ గర్భాలయంపై విమానాలు వెళ్లకూడదనే ఆగమశాస్త్ర నిబంధన ఉంది. ఈ క్రమంలోనే టీటీడీ (TTD) పలుమార్లు తిరుమలను న్లోఫ్లైయింగ్‌ జోన్‌గా ప్రకటించాలని కేంద్రానికి విజ్ఞప్తులు చేసినప్పటికీ సాధ్యం కాదని కేంద్రం తేల్చిచెప్పింది. అయినప్పటికీ భక్తుల (Devotees) మనోభావాలు, టీటీడీ విన్నపం మేరకు లోహైట్‌, గర్భాలయం మీదుగా విమానాలు ప్రయాణించకుండా కేంద్రం చర్యలు తీసుకుంటూ వస్తోంది.

ఇటీవల వరుసగా విమానాలు క్షేత్రం మీదుగా ప్రయాణిస్తూనే ఉన్నాయి. ఏప్రిల్‌ 25వ తేదీన వరుసగా మూడు హెలికాఫ్లర్లు తిరుమల మీదుగా వెళ్లాయి. ఆ తర్వాత మే 4న ఓ విమానం, 8వ తేదీన వరుసగా మూడు విమానాలు క్షేత్రానికి సమీపంగా వెళ్లాయి. తాజాగా శుక్రవారం కూడా లోహైట్‌లో విమానం ప్రయణించడం చర్చనీయాంశమైంది. ఆగమశాస్ర్తాన్ని దృష్టిలో పెట్టుకుని టీటీడీ మరోసారి విమానాల రాకపోకలపై కేంద్రంతో చర్చించాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Updated Date - 2023-06-09T21:55:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising