ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Peetala Sujatha: వైసీపీ మహిళా నేతలే అలా మాట్లాడుతున్నారు... రేప్‌లలో ఎవరికైనా అనుభవం ఉందా?

ABN, First Publish Date - 2023-07-21T12:59:37+05:30

జగన్ ప్రభుత్వంలో మహిళలపై అరాచకాలు పెరిగాయని మాజీ మంత్రి పీతల సుజాత అన్నారు.

అమరావతి: జగన్ ప్రభుత్వంలో (Jagan Government) మహిళలపై అరాచకాలు పెరిగాయని మాజీ మంత్రి పీతల సుజాత (Former Minister Peetala Sujatha) అన్నారు. మహిళల ఆత్మ గౌరవ దీక్ష శిబిరంలో మాజీ మంత్రి మాట్లాడుతూ.. దేశంలో మహిళలపై అరాచకాల్లో ఏపీ మొదటి స్థానంలో ఉందని.. జగన్ సిగ్గుపడాలన్నారు. తెలుగు మహిళలు దేనికీ భయపడే ప్రసక్తే లేదని తెలిపారు. ఫేక్ పోస్టులు, తప్పుడు రాతలు రాసే వారు తమ కుటుంబ సభ్యులను గుర్తుపెట్టుకోవాలని హితవుపలికారు. వైసీపీ నేతలు ఫేక్ పోస్టులను కొనసాగిస్తే వాళ్ల ఇళ్లకు తెలుగు మహిళలు వెళ్లి చెప్పులతో బడితపూజ చేయడానికి వెనుకాడరని హెచ్చరించారు. తెలుగు మహిళల్లో వచ్చిన చైతన్యం చూసి పేటీఎం బ్యాచులకు తడిచిపోతోందంటూ వ్యాఖ్యలు చేశారు. ఒకటి రెండు రేప్‌లు జరిగితే ఏముందంటూ వైసీపీ మహిళా నేతలే మాట్లాడుతున్నారని.. రేప్‌లలో ఎవరికైనా అనుభవం ఉందా అంటూ విరుచుకుపడ్డారు. తల్లుల పెంపకం సరిగా లేదు, వస్త్రధారణ సరిగా ఉండడం లేదు, తాగిన మైకంలో తప్పు చేశారని వైసీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు మహిళల్లో ఆందోళన కలిగిస్తున్నాయన్నారు. అన్నం తినే వాళ్లెవరూ మహిళలపై పోస్టులు పెట్టరని.. అవమానించరని మాజీ మంత్రి పీతల సుజాత వ్యాఖ్యలు చేశారు.

Updated Date - 2023-07-21T12:59:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising