ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Global Investors Summit: ఢిల్లీలో గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌కు ఆదరణ కరవు.. విశాఖలో ఆదరిస్తారా..?

ABN, First Publish Date - 2023-02-09T18:32:33+05:30

విశాఖలో మార్చి 3, 4 తేదీల్లో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ (Global Investors Summit) నిర్వహిస్తున్నట్లు మంత్రి అమర్‌నాథ్ (Minister Amarnath) తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: విశాఖలో మార్చి 3, 4 తేదీల్లో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ (Global Investors Summit) నిర్వహిస్తున్నట్లు మంత్రి అమర్‌నాథ్ (Minister Amarnath) తెలిపారు. సమ్మిట్కు కేంద్ర మంత్రులు రాజ్నాథ్‌సింగ్ (Rajnath Singh), నితిన్ గడ్కరీ, మన్సుఖ్ మాండవీయను ఆహ్వానించామన్నారు. ఏపీకి పెట్టుబడులు తేవడమే లక్ష్యంగా సమ్మిట్ నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు. 13 సెక్టార్లలో దృష్టి సారించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. బుధవారం ముంబయిలో రిలయన్స్ (Reliance), టాటా, మహేంద్రా గ్రూప్ (Mahendra Group) అధినేతలను కలిసి సమ్మిట్కు ఆహ్వానించామని చెప్పారు. గతంలో జరిగిన సమ్మిట్లలో రూ.18 లక్షల కోట్లు పెట్టుబడులు అని భావించినా.. రూ.లక్షా 80 వేల కోట్లు పెట్టుబడులు మాత్రమే వచ్చాయని అమర్నాథ్ పేర్కొన్నారు. రాష్ట్రానికి పెట్టుబడు లను ఆకర్షించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం నిర్వహిస్తున్న గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌ లోగోను మంగళవారం జిల్లా కలెక్టర్‌ ప్రసన్న వెంకటేష్‌ ఆవిష్కరించారు. విశాఖలో జరిగే ఈ కార్యక్రమానికి దేశ విదేశాల నుంచి పారిశ్రామిక వేత్తలు హాజరవుతున్నా రని అడ్వాంటేజ్‌ ఆంధ్రా అనే పేరుతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దానిలో మెరైన్‌ ఉత్పత్తులు, ఆగ్రో ఫుడ్‌ ప్రోసెసింగ్‌, డిఫెన్స్‌ ఉత్పత్తులు ఈ సమ్మిట్‌ లో ప్రదర్శిస్తారని విదేశాల నుంచి పారిశ్రామిక వేత్తలు, ఇన్వెస్టర్లు పాల్గొంటారన్నారు.

ఢిల్లీలో గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌కు ఆదరణ కరవు

విశాఖపట్టణంలో జరగనున్న గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌కు సన్నాహకంగా ఇటీవల ఢిల్లీలో జరిగిన సమావేశానికి పెద్దగా స్పందన రాలేదు. ఉదయం నుంచి సాయంత్రం వరకు కార్యక్రమం జరిగినా... పెట్టుబడులపై కనీస సానుకూలతను కూడా రాష్ట్ర ప్రభుత్వం రాబట్టలేకపోయింది. ఉదయం పలు దేశాలకు చెందిన దౌత్యవేత్తలను సీఎం జగన్ (CM Jagan) కలిశారు. మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు పలువురు పారిశ్రామికవేత్తలను జగన్‌ కలుసుకున్నారు. బహుళజాతి కంపెనీల ప్రతినిధులు అతి తక్కువ సంఖ్యలో హాజరయ్యారు. రాష్ట్రంలో అనుకూల పరిస్థితులున్నాయని వారితో మాట్లాడించారు. మొత్తం మీద సాధారణ పారిశ్రామికవేత్తలు మాత్రమే ఈ భేటీలో ఆసక్తిని ప్రదర్శించారు. ముఖ్యమంత్రి సమక్షంలో మాట్లాడిన పారిశ్రామికవేత్తల్లో చాలా మంది 2014 - 2019 మధ్యకాలంలో చంద్రబాబు హయాంలో పెట్టుబడులు పెట్టినవారే ఉండడం గమనార్హం.

Updated Date - 2023-02-09T18:32:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising