జగన్ దేనికైనా తెగించే అవకాశం ఉంది: గోనె ప్రకాశరావు
ABN, First Publish Date - 2023-09-13T12:34:17+05:30
టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ అనేది ఏపీ చరిత్రలో ఒక చీకటి రోజు అని మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాశరావు అన్నారు. చంద్రబాబుకు సౌకర్యాల విషయంలో జైలర్ కోర్టు ఆదేశాలను పాటించకపోవచ్చన్నారు.
ఢిల్లీ : టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ అనేది ఏపీ చరిత్రలో ఒక చీకటి రోజు అని మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాశరావు అన్నారు. చంద్రబాబుకు సౌకర్యాల విషయంలో జైలర్ కోర్టు ఆదేశాలను పాటించకపోవచ్చన్నారు. జైలర్ కోర్టు ఏపీ ప్రభుత్వ ఆధీనంలో ఉంటుందన్నారు. చంద్రబాబును ప్రభుత్వ గెస్ట్ హౌస్ కానీ, హౌస్ అరెస్ట్‌లో కానీ ఉంచవచ్చని అన్నారు. ఇంకా గోనె ప్రకాశరావు మాట్లాడుతూ.. ‘‘ జగన్ అనేవాడు దేనికైనా తెగించడానికి అవకాశం ఉంది. అన్ని సర్వేలు జగన్ ఓడిపోతున్నాడని చెబుతున్నాయి.
జగన్ ఓడిపోతున్నాడని ఆయన సొంత పార్టీ నేతలే ఒప్పుకుంటున్నారు. చంద్రబాబు సీఎం కావడం ఖాయం. చంద్రబాబు సీఎం అయిన తర్వాత ఒక్కరోజు కూడా జగన్ అసెంబ్లీ లోకి రాలేడు. హైదరాబాద్‌లోనో, కూతురు దగ్గరకో పారిపోవడం ఖాయం. జగన్ పై నమోదయిన కేసుల విషయంలో ఆయన జైలుకు వెళ్లడం ఖాయం. జగన్ ఇప్పటికైనా మారాలి. మారకపోతే తీవ్రమైన పర్యవసానాలు ఎదుర్కొనాల్సి వస్తుంది. చంద్రబాబును అరెస్ట్ విషయంలో జగన్ తప్పుడు నిర్ణయం తీసుకున్నారని వైసీపీ అగ్ర నేతలు అంటున్నారు’’ అని పేర్కొన్నారు.
Updated Date - 2023-09-13T12:34:17+05:30 IST