Gorantla Butchiah Chowdary: మళ్లీ ఎన్నికల్లో పోటీ చేసి అసెంబ్లీలో అడుగు పెడతా
ABN, First Publish Date - 2023-11-22T12:59:29+05:30
సీఐడీ వాళ్ళు తనకు నోటీసులు ఇచ్చినట్టు వైసీపీ ప్రచారం చేసిందని.. సీఐడీ నోటీసులకు భయపడే ప్రసక్తే లేదని టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి తెలిపారు. జగన్ వ్యవస్థలను మేనేజ్ చేసి ప్రశ్నించే వారిని జైలులో పెడుతున్నారు. జగన్ గ్యాంగ్ కోర్టు ధిక్కరణకు పాల్పడుతోందన్నారు. నిత్యం 144, 30 సెక్షన్లు పెట్టి ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు. జగన్ సీఐడీతో కలిసి ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు.
రాజమండ్రి : సీఐడీ వాళ్ళు తనకు నోటీసులు ఇచ్చినట్టు వైసీపీ ప్రచారం చేసిందని, సీఐడీ నోటీసులకు భయపడే ప్రసక్తే లేదని టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. జగన్ వ్యవస్థలను మేనేజ్ చేసి ప్రశ్నించే వారిని జైలులో పెడుతున్నారని మండిపడ్డారు. జగన్ గ్యాంగ్ కోర్టు ధిక్కరణకు పాల్పడుతోందని ఆరోపించారు. నిత్యం 144, 30 సెక్షన్లు పెట్టి ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ సీఐడీతో కలిసి ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. తానెప్పుడు న్యాయవ్యవస్థకు వ్యతిరేకంగా మాట్లాడలేదన్నారు.
‘‘ప్రతిపక్ష నేతలపై తప్పుడు కేసులు పెట్టి ఎన్నిరోజులు జైలులో పెడతారు?. రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించే జగన్ రాష్ట్రానికి అవసరమా?. జగన్ గ్యాంగ్ మేసే గ్యాంగ్.. దళితులపై దాడులు చేస్తోంది. రోజూ దళితులపై దాడి చేస్తోంది. ఆయన ఉద్దేశ్యం ప్రజలను భయపెట్టడం, జైలుకి పంపటం. యువగళం పాదయాత్ర ఈ నెల 24 నుంచి మళ్ళీ ప్రారంభమవుతుంది. మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేసి గెలుస్తాను. అసెంబ్లీలో అడుగుపెడతాను’’ అని గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు.
Updated Date - 2023-11-22T13:29:19+05:30 IST