ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Tirumala: శ్రీవారి సేవలో గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌

ABN, First Publish Date - 2023-04-29T21:41:25+05:30

గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ (Governor Abdul Nazir) శనివారం తిరుమల వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ బ్రేక్‌ (VIP Break) సమయంలో ఆలయంలోకి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుమల: గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ (Governor Abdul Nazir) శనివారం తిరుమల వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ బ్రేక్‌ (VIP Break) సమయంలో ఆలయంలోకి వెళ్లిన ఆయన ముందుగా ధ్వజస్తంభానికి మొక్కుకుని తర్వాత గర్భాలయంలోని మూలమూర్తిని దర్శించుకున్నారు.రంగనాయక మండపంలో వేదపండితులు ఆశీర్వదించగా, అధికారులు లడ్డూప్రసాదాలు అందజేశారు. కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌ఆర్‌ కృష్ణకుమార్‌ కూడా శనివారం వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు.

వేడుకగా పద్మావతి పరిణయోత్సవాలు

తిరుమల: తిరుమల నారాయణగిరి ఉద్యానవనాల్లో శనివారం పద్మావతి పరిణయోత్సవాలు శోభాయమానంగా ప్రారంభమయ్యాయి. మలయప్పస్వామి గజవాహనాన్ని అధిరోహించగా, ఉభయ నాంచారులు పల్లకీపై నారాయణగిరి ఉద్యానవనంలోని పరిణయోత్సవ మండపానికి సాయంత్రం వేంచేశారు. పెండ్లిమండపంలో స్వామి, అమ్మవార్లకు ఎదుర్కోలు, పూలదండలు మార్చుకోవడం, పూలబంతులాట, నూతన వస్త్ర సమర్పణ కోలాహలంగా జరిగింది. తర్వాత స్వామికి కొలువు నిర్వహించారు.వేదాలు, పురాణాలు, సంగీతరాగాలు, కవితలు, నృత్యాలు నివేదించారు. మంగళవాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్ల కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. తర్వాత శ్రీదేవి, భూదేవి సహితుడైన స్వామి బంగారు తిరుచ్చిపై ఆలయ ప్రవేశం చేయడంతో తొలిరోజు వేడుక ముగిసింది.

Updated Date - 2023-04-29T21:41:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising