Bopparaju: ఉద్యోగులను ప్రభుత్వం మోసం చేసింది: బొప్పరాజు
ABN, First Publish Date - 2023-03-09T16:31:23+05:30
ఉద్యోగులను ప్రభుత్వం మోసం చేసిందని ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు (Bopparaju Venkateshwarlu) దుయ్యబట్టారు.
అమరావతి: ఉద్యోగులను ప్రభుత్వం మోసం చేసిందని ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు (Bopparaju Venkateshwarlu) దుయ్యబట్టారు. ఉద్యోగుల డబ్బును ఇతర అవసరాలకు వాడుకుందని, నెలాఖరులోపు చెల్లిస్తామని ప్రభుత్వం చెబుతుందని, డీఏ, ఏరియర్స్ ఎంతో లెక్కలు లేవని తెలిపారు. ఉద్యమ కార్యాచరణలోకి వెళ్లిన వారిని మభ్యపెట్టలేరని దుయ్యబట్టారు. పీఆర్సీ (PRC) ఒప్పందాలను పూర్తిగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. పీఆర్సీ పే స్కేల్ గురించి స్పష్టత ఇవ్వలేదన్నారు. స్పష్టత లేకుండా మొక్కుబడిగా చర్చలకు పిలిచారని తప్పుబట్టారు. రిటైర్ అయిన వారికి బెన్ఫిట్స్ అందని పరిస్థితి ఉందని బొప్పరాజు తెలిపారు. వేతనాలు ప్రతినెలా ఒకటో తారీఖున ఇవ్వాలని కోరామని, ప్రభుత్వం మాత్రం ఇవ్వలేమని, సాధ్యపడదని అంటోందని పేర్కొన్నారు. సీపీఎస్ (CPS) ఉద్యోగులకు సంబంధించి రూ.2,600కోట్లు చెల్లించలేదని చెప్పారు. సీపీఎస్ రద్దు మినహా మరే ప్రత్యామ్నాయం తమకు అక్కర్లేదన్నారు. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్దీకరణపై పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను మోసం చేశారని, ప్రభుత్వం మొక్కుబడిగా హామీలు ఇస్తుందని అందుకే తమ కార్యాచరణ అమలుకు తీర్మానించామని బొప్పరాజు ప్రకటించారు.
Updated Date - 2023-03-09T16:33:33+05:30 IST