ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

LokeshPadayatra: గ్రూప్‌-1 మెయిన్స్‌ గడువు పొడిగించాలి: నారా లోకేశ్‌

ABN, First Publish Date - 2023-03-23T21:33:16+05:30

ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఏపీపీఎస్సీ) నిర్వహిస్తున్న గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షకి అభ్యర్థులు ప్రిపేర్‌ అయ్యేందుకు మరో మూడు నెలలు అదనపు సమయం ఇవ్వాలని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

పుట్టపర్తి: ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఏపీపీఎస్సీ) నిర్వహిస్తున్న గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షకి అభ్యర్థులు ప్రిపేర్‌ అయ్యేందుకు మరో మూడు నెలలు అదనపు సమయం ఇవ్వాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ (Nara Lokesh) కోరారు. యువగళం పాదయాత్ర (Yuvagalam Padayatra) చేపడుతున్న ఆయన శ్రీసత్యసాయి జిల్లా ఓబుళదేవరచెరువు మండలం వనుకువారిపల్లి వద్ద ఏర్పాటు చేసిన శిబిరం నుంచి సీఎం జగన్‌ (CM Jagan), ఏపీపీఎస్సీ చైర్మన్‌ గౌతం సవాంగ్‌కు గురువారం వేర్వేరుగా లేఖలు రాశారు. జగన్‌ ప్రతిపక్ష నేతగా ఉన్నపుడు, అధికారంలోకి వస్తే ఏటా జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేస్తామని హామీ ఇచ్చి, ఆమాటే మరచిపోయారని నారా లోకేశ్‌ లేఖలో విమర్శించారు. ఓవైపు ప్రభుత్వ నియామకాల్లేక, మరోవైపు ప్రైవేటు ఉద్యోగాలు లేక యువత నిరాశ, నిస్పృహలకు లోనవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన నాలుగేళ్ల తరువాత విడుదల చేసిన ఏపీపీఎస్సీ గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ రాసి, క్యాలిఫై అయిన అభ్యర్థులకు ప్రిపేర్‌ అయ్యే సమయం తక్కువగా ఇచ్చారన్నారు. దీంతో అభ్యర్థులు టెన్షన్‌కు లోనవుతున్నారన్నారు. మరో మూడు నెలల సమయం కేటాయించాలని లేఖలో కోరారు.

Updated Date - 2023-03-23T21:34:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising