ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

AP NEWS: మళ్లీ రూ.వెయ్యి కోట్ల అప్పు కోసం ఏపీ ప్రభుత్వం టెండర్.. కేంద్రం అనుమతి

ABN, First Publish Date - 2023-01-20T19:47:24+05:30

మళ్లీ రూ.వెయ్యి కోట్ల అప్పునకు ఏపీ ప్రభుత్వం (AP government) టెండర్ పెట్టింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: మళ్లీ రూ.వెయ్యి కోట్ల అప్పునకు ఏపీ ప్రభుత్వం (AP government) టెండర్ పెట్టింది. వచ్చే మంగళవారం సెక్యూరిటీ బాండ్ల వేలానికి ఏపీ సర్కారు సిద్ధమైంది. రూ.వెయ్యి కోట్ల బాండ్లను ఏపీ సర్కార్‌ 12 ఏళ్లకు వేలానికి పెట్టింది. FRBM కింద రూ.4,557 కోట్ల అదనపు రుణానికి కేంద్రం అనుమతి (Central permission) ఇచ్చింది. 15 రోజుల క్రితం రూ.2 వేల కోట్ల సెక్యూరిటీ బాండ్ల వేలం వేసింది. మరో రూ.వెయ్యి కోట్ల బాండ్ల వేలానికి ఏపీ సర్కార్‌ సిద్ధమైంది.

రెండు వారాల క్రితం రూ.2 వేల కోట్ల మేర బాండ్ల వేలానికి కేంద్ర ఆర్ధికశాఖ గ్రీన్ సిగ్నలిచ్చింది. ఆర్‌బీఐ (RBI)కి శుక్రవారం ఏపీ ప్రభుత్వం ఇండెంట్ పెట్టింది. రూ.వెయ్యి కోట్లు 6 సంవత్సరాలకు. మరో రూ.వెయ్యి కోట్లు పదేళ్లకు వేలం పెట్టనున్నారు. అయితే రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం (YCP Government) అధికారంలోకి వచ్చాక ఉద్యోగుల పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. ఉద్యోగుల్లో ఎక్కువమంది అద్దె ఇళ్లల్లో ఉంటున్నారు. 1వ తేదీ వచ్చిదంటే ఇంటి అద్దెతోపాటు ఈఎంఐలు, పిల్లల చదువుల ఫీజులు కట్టాల్సి ఉండగా.. రిటైర్డ్‌ ఉద్యోగులు వారికి అవసరమైన మందులను కొనుగోలు చేసుకోవాల్సి ఉంది. అయితే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏ నెలా వేతనాలు సకాలంలో పడిన పరిస్థితి లేకపోవడంతో ఉద్యోగులు ఈఎంఐలు కూడా పెనాల్టీలతో చెల్లించాల్సిన దుర్భర పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. గత నెలలో 18వ తేదీ కూడా కొంతమంది ఉద్యోగుల జీతాలు పడ్డాయి. కొందరికైతే నెలఖారు వరకు పడుతూనే ఉన్నాయి. ప్రధానంగా ఉపాధ్యాయులకు జీతాలు అందరికన్నా చివర ఇచ్చిన పరిస్థితి.

Updated Date - 2023-01-20T20:03:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising