Palnadu Dist.: వినుకొండలో వైసీపీ నేతల అరాచకం..
ABN, First Publish Date - 2023-04-18T12:19:04+05:30
పల్నాడు జిల్లా: రాష్ట్రంలో వైసీపీ నేతలు (YCP Leaders) అరాచకాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. పోలీసులు, అధికారులు కూడా వారికి కొమ్ముకాయడంతో వారు ఇంకా రెచ్చిపోతున్నారు.
పల్నాడు జిల్లా: రాష్ట్రంలో వైసీపీ నేతల (YCP Leaders) అరాచకాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. పోలీసులు, అధికారులు కూడా వారికి కొమ్ముకాయడంతో వారు ఇంకా రెచ్చిపోతున్నారు. తాజాగా పల్నాడు జిల్లా, వినుకొండలో వైసీపీ నేతలు అరాచకానికి పాల్పడ్డారు. తిమ్మాయపాలెం రోడ్డులో శశిధరణి స్వీట్స్ తయారీ కేంద్రంతో పాటు మరో ఇల్లు కబ్దా చేశారు. వైసీపీ పట్టణ అధ్యక్షుడు ఖాన్ ఆధ్వర్యంలో వైసీపీ వర్గీయులు 150 మంది వరకు మూకుమ్మడి దాడి చేసి.. రెండు ఇళ్లను ద్వంసం చేశారు. స్దలం తమదే నంటూ దౌర్జన్యానికిదిగి.. బాధితులపై దాడి చేశారు. స్థానిక ఎమ్మెల్యే బొల్లా అండతోనే తమ ఇల్లు కబ్జా చేశారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.
కాగా ప్రభుత్వ పెద్దలు నిత్యం చెప్పే మాట ‘సంక్షే మం’. తమ ఏలుబడిలో పేదలను ఉద్ధరిస్తున్నట్టు చెబుతున్నారు. బహిరంగ సభ అయినా, అసెంబ్లీ అయినా, బటన్ నొక్కుడు కార్యక్రమం అయినా ఓ రేంజ్‌లో గొప్పలు చెబుతుంటారు. కానీ... జగన్ చెబుతున్న సంక్షేమం ఒట్టి డొల్ల అని ‘అక్క చెల్లెమ్మలే’ పేర్కొంటున్నారు. ఒక చేత్తో ఇస్తూ.. మరో చేత్తో లాక్కుంటూ బతుకు భారం చేశారని వాపోతున్నారు. పన్నులు, చార్జీలు, ధరలతో జనం విలవిలలాడిపోతున్నారు. వివిధ వర్గాలకు చెందిన దాదాపు 90 శాతం మంది మహిళలు ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. పథకాలు పొందుతూ కూడా ఎందుకు విమర్శిస్తున్నారని ప్రశ్నిస్తే... కష్టాలు ఏకరువు పెడుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పలు పథకాల లబ్ధిదారులుగా ఉన్న 45-60 ఏళ్ల మహిళలను ‘ఆంధ్రజ్యోతి’ కలిసి ప్రశ్నించింది. వీరిలో అత్యధికులు జగన్ సంక్షేమ పథకాల్లోని డొల్లతనాన్ని ఎండగట్టారు. ప్రభుత్వ పథకాలు కట్ చేస్తారనే భయంతో కొందరు తమ పేర్లు, ఫొటోలు ప్రచురించవద్దని కోరారు.
Updated Date - 2023-04-18T12:19:04+05:30 IST