AP News: బీజేపీ హైకమాండ్ నుంచి కన్నా లక్ష్మీనారాయణకు ఫోన్
ABN, First Publish Date - 2023-01-24T11:03:32+05:30
అమరావతి: బీజేపీ హైకమాండ్ (BJP High Command) నుంచి కన్నా లక్ష్మీనారాయణ (Kanna Lakshminarayana)కు ఫోన్ వచ్చింది.
అమరావతి: బీజేపీ హైకమాండ్ (BJP High Command) నుంచి కన్నా లక్ష్మీనారాయణ (Kanna Lakshminarayana)కు ఫోన్ వచ్చింది. తామువచ్చి అన్ని విషయాలు మాట్లాడతామని బీజేపీ పెద్దలు చెప్పారు. అయితే కన్నా లక్ష్మీనారాయణ జనసేన (Janasena)లో చేరుతున్నట్లు సోషల్‌మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారాన్ని కన్నా వర్గీయులు ఖండించారు.
పూర్తి వివరాలు..
ఏపీ బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలకు కన్నా లక్ష్మీనారాయణ దూరంగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన హైదరాబాద్‌లోనే ఉన్నారు. దీంతో కార్యవర్గ సమావేశానికి కన్నా రాకపోవడంతో పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇటీవల జాతీయ కార్యవర్గ సమావేశాలకు కూడా ఆయన హాజరుకాలేదు. దీనిపై జాతీయ నేతలు ఆరా తీశారు. పార్టీలో కొందరు నేతలు చేసిన వ్యాఖ్యలపై కన్నా లక్ష్మీనారాయణ మనస్తాపం చెందారు. తన హయాంలో నియమించినవారిని తొలగించడంపై అసంతృప్తిగా ఉన్నారు. కోర్ కమిటీలో చర్చించకుండా తొలగించడమేంటని కన్నా ప్రశ్నించారు.
Updated Date - 2023-01-24T11:03:39+05:30 IST