ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Palnadu Dist...జగన్ ఇంటిముందు ఆత్మహత్య చేసుకుంటా..: వైసీపీ కార్యకర్త

ABN, First Publish Date - 2023-04-14T11:58:05+05:30

పల్నాడు జిల్లా: పెదకూరపాడు నియోజకవర్గం వైసీపీ కార్యకర్త గోపీనాథ్ (YCP activist Gopinath) తీవ్ర మనస్తాపం చెందుతూ ఓ వీడియో (Video) విడుదల చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

పల్నాడు జిల్లా: పెదకూరపాడు నియోజకవర్గం వైసీపీ కార్యకర్త గోపీనాథ్ (YCP activist Gopinath) తీవ్ర మనస్తాపం చెందుతూ ఓ వీడియో (Video) విడుదల చేశారు. తాను 2017 నుంచి ఇప్పటి వరకు పల్నాడు జిల్లా, పెదకూరపాడు నియోజకవర్గంలో జరుగుతున్న ప్రతి వైసీపీ కార్యక్రమంలో పాల్గొంటున్నానని, 2019 జనవరిలో ఎమ్మెల్యే నంబూరి శంకరరావు (Namburi Shankarao) టిక్కెట్ విషయంలో జరిగిన ఘర్షణలో తనపై 307 అటెంప్ట్ మర్డర్ కేసు (Attempt Murde Case) పెట్టారని.. తదనంతరం ఎన్నికల్లో నంబూరి శంకరరావు కోసం పనిచేశానని చెప్పారు. అయినా ఎమ్మెల్యే తనపై కక్ష పెంచుకుని, అక్రమ కేసులు బనాయించి.. రౌడీ షీటు ఓపెన్ చేయాలని పోలీసులపై తీవ్ర ఒత్తిడికి గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు రెండురోజులుగా తన ఇంట్లో తనిఖీలు చేస్తున్నారని అన్నారు.

తనకు ఇప్పటి వరకు పెళ్లికాలేదని, ఈ విధంగా తనపై అక్రమ కేసులు బనాయించి, రౌడీ షీటు తెరిస్తే తనకు అమ్మాయిని ఇవ్వడానికి ఎవరూ ముందుకు రారని గోపీనాథ్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో తనకు ఆత్మహత్య చేసుకోవడం తప్ప వేరే మార్గం లేదన్నారు. తనపై పెట్టిన అక్రమ కేసులు రెండు రోజుల్లో ఎత్తివేయకపోతే.. తాను సీఎం జగన్మోహన్ రెడ్డి నివాసం ముందు ఆత్మహత్య చేసుకుంటానన్నారు. నంబూరి శంకరరావుకు ఎవరైనా నచ్చకపోతే అక్రమ కేసులు బనాయిస్తారన్నారు. ఎమ్మెల్యే కుటుంబసభ్యులు, ఆయన అనుచరులు కృష్ణారెడ్డి, రవి చౌదరిలతో తనకు ప్రాణహాని ఉందని, తనకు రక్షణ కల్పించాలని గోపీనాథ్ ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

Updated Date - 2023-04-14T11:58:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising