కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

గుంటూరు కార్పోరేషన్ కౌన్సిల్ సమావేశంలో ఎమ్మెల్యే వర్సెస్ మేయర్

ABN, First Publish Date - 2023-08-17T11:44:01+05:30

గుంటూరు కార్పోరేషన్ కౌన్సిల్ సమావేశం రగడ మొదలైంది. మరోసారి మేయర్ కావటి మనోహర్ టార్గెట్‌గా ఎమ్మెల్యే ముస్తఫా విమర్శలు గుప్పించారు. రెండేళ్ళుగా తూర్పు నియోజకవర్గంలో అభివృద్ధి జరగడం లేదంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

గుంటూరు కార్పోరేషన్ కౌన్సిల్ సమావేశంలో ఎమ్మెల్యే వర్సెస్ మేయర్

గుంటూరు : గుంటూరు కార్పోరేషన్ కౌన్సిల్ సమావేశం రగడ మొదలైంది. మరోసారి మేయర్ కావటి మనోహర్ టార్గెట్‌గా ఎమ్మెల్యే ముస్తఫా విమర్శలు గుప్పించారు. రెండేళ్ళుగా తూర్పు నియోజకవర్గంలో అభివృద్ధి జరగడం లేదంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అభివృద్ధి చేయడంపై మేయర్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్నారు. నిధుల కొరత కారణంగా పనులు జరగడం లేదంటూ మేయర్ చెబుతున్నారంటూ ఎమ్మెల్యే వ్యాఖ్యానిస్తున్నారు. ఎమ్మెల్యే వ్యాఖ్యలపై మేయర్ కావటి స్పందించారు. తూర్పు నియోజకవర్గంలో జరుగుతున్న పనులపై అన్ని లెక్కలు ఇస్తామన్నారు. ఏ పనులు పెండింగ్‌లో ఉన్నాయో చర్చ చేసేందుకు సిద్ధంగా ఉన్నామని మేయర్ అన్నారు. ఇద్దరి మధ్య నేరుగానే వాగ్వాదం జరిగింది.

Updated Date - 2023-08-17T11:44:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising