AP High Court: విద్యుత్ ఉద్యోగుల ధర్నాపై హైకోర్టు ఏం చూసిందంటే..!
ABN, First Publish Date - 2023-08-29T15:13:03+05:30
ఏపీ విద్యుత్ ఉద్యోగుల పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. విజయవాడ ధర్నా చౌక్‌లో ధర్నాకు అనుమతి కోరుతూ ఏపీ విద్యుత్ ఉద్యోగులు పిటిషన్ దాఖలు చేశారు.
అమరావతి: ఏపీ విద్యుత్ ఉద్యోగుల పిటిషన్‌పై హైకోర్టులో (Ap High Court) విచారణ జరిగింది. విజయవాడ ధర్నా చౌక్‌లో ధర్నాకు అనుమతి కోరుతూ ఏపీ విద్యుత్ ఉద్యోగులు పిటిషన్ దాఖలు చేశారు. విద్యుత్ ఉద్యోగులపై ఎస్మా వర్తిస్తుందని ప్రభుత్వం తరపు న్యాయవాది వాదించారు. ధర్నాకు అనుమతి ఇవ్వొద్దని సూచించారు. ఇదిలా ఉంటే 1000 మందితో ధర్నాకు ఏపీ విద్యుత్ ఉద్యోగులు అనుమతి కోరారు. ఏపీ విద్యుత్ ఉద్యోగులు తమ న్యాయబద్దమైన హక్కుల కోసం పోరాడుతున్నారని పిటిషనర్ల తరపున న్యాయవాది మాధవరావు వాదనలు వినిపించారు. 500 మందితో ధర్నా చేసుకునే అంశాన్ని పరిశీలించాలని విద్యుత్ ఉద్యోగులకు హైకోర్టు సూచించింది. తదుపరి విచారణ ఎల్లుండికి ధర్మాసనం వాయిదా వేసింది.
Updated Date - 2023-08-29T15:13:03+05:30 IST