Amaravathi: మంత్రి అంబటి రెండున్నర లక్షలు అడగింది నిజం: గంగమ్మ
ABN, First Publish Date - 2023-02-17T12:38:59+05:30
అమరావతి: వైసీపీ మంత్రి అంబటి రాంబాబు (Minister Ambati Rambabu) ఓ వివాదంలో చిక్కుకున్నారు.
అమరావతి: వైసీపీ మంత్రి అంబటి రాంబాబు (Minister Ambati Rambabu) ఓ వివాదంలో చిక్కుకున్నారు. ఆయన సొంత నియోజకవర్గం సత్తెనపల్లిలో ఓ మహిళ నుంచి తన కుమారుడి మృతికి వచ్చిన పరిహారంలో వాటా ఇవ్వాలని మంత్రి కోరినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ సందర్భంగా బాధితురాలు గంగమ్మ (Gamgamma) మీడియాతో మాట్లాడుతూ తన కుమారుడు చనిపోతే ఆదుకోమని అంబటి రాంబాబును కోరానని, సీఎం సహాయ నిధి (CM Relief Fund) నుంచి రూ. ఐదు లక్షలు వచ్చాయన్నారు. అందులో రెండున్నర లక్షలు అంబటి అడిగారని.. ఎందుకివ్వాలంటే.. తనపై ఆగ్రహం వ్యక్తం చేశారంది.
జరిగిన విషయం మీడియా ముందు చెప్పానని తనపై మంత్రి అంబటి కక్ష కట్టారని బాధితురాలు గంగమ్మ తెలిపింది. జరిగిందే చెప్పానంటే... తననే తిట్టారంది. సీఎం సహాయ నిధి నుంచి వచ్చిన ఐదు లక్షల చెక్ (Five Lakh Check)ను తనకు ఇవ్వకుండా వెనక్కి పంపేశారని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ విషయం తెలుసుకున్న జనసేన నాయకులు (Janasena Leaders) తనకు అండగా నిలిచారని.. నాదెండ్ల మనోహర్ (Nadendla Manohar) రూ. నాలుగు లక్షల చెక్‌ను ఇచ్చారని తెలిపింది. ‘‘నేను ఇప్పుడు కూడా చెబుతున్నా... నేమేమీ తప్పు చేయలేదు.. అంబటి రాంబాబు గారు రెండున్నర లక్షలు అడగింది నిజం.. మీడియాకు చెప్పానని చెక్ వెనక్కి పంపింది వాస్తవం.. అధికారులను కలిస్తే... నువ్వు అలా చెప్పడం వల్లే డబ్బులు ఇవ్వలేదని చెప్పారు... నాలాంటి సామాన్య మహిళపై మంత్రి అంబటి రాంబాబు ప్రతాపం చూపితే ఎలా?.. అంటూ ఆమె ప్రశ్నించింది. జనసేన నాయకులు ఇచ్చిన డబ్బు తన కుటుంబానికి ఎంతో ఆసరాగా నిలిచిందని గంగమ్మ పేర్కొంది.
Updated Date - 2023-02-17T12:39:02+05:30 IST