ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

AP NEWS: కాంగ్రెస్ ఏపీ మహిళా రాష్ట్ర అధ్యక్షురాలిగా తాంతియాకుమారి

ABN, First Publish Date - 2023-08-07T15:09:25+05:30

కాంగ్రెస్(Congress) ఏపీ మహిళా రాష్ట్ర అధ్యక్షురాలిగా తాంతియాకుమారి(Tantiakumari)ని నియమిస్తూ కాంగ్రెస్ అధిష్టానం ఉత్వర్వులు జారీ చేసింది.

విజయవాడ: కాంగ్రెస్(Congress) ఏపీ మహిళా రాష్ట్ర అధ్యక్షురాలిగా తాంతియాకుమారి(Tantiakumari)ని నియమిస్తూ కాంగ్రెస్ అధిష్టానం ఉత్వర్వులు జారీ చేసింది. ఏపీసీసీ కార్యాలయం(APCC office)లో తాంతియాకుమారి నేడు అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. తాంతియాకుమారి మాజీ మంత్రి కోనేరు రంగారావు కుమార్తె. ప్రమాణ స్వీకార సభలో పాల్గొన్న ఏఐసీసీ నేత డిసౌజా, ఏపీసీసీ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు, తులసిరెడ్డి, మస్తాన్ వలీ, సుంకర పద్మశ్రీ తదితరులు పాల్గొన్నారు.


మహిళలకు కాంగ్రెస్‌లో పెద్ద పీట: తులసిరెడ్డి

ఏపీలో కాంగ్రెస్ పాలన ఒక స్వర్ణయుగంగా సాగిందని కాంగ్రెస్ సీనియర్ నేత తులసిరెడ్డి(Tulsi Reddy) అన్నారు. మహిళలకు కాంగ్రెస్ ప్రాధాన్యత ఇస్తూ.. పెద్ద పీట వేశారు.అనుభవం కలిగిన తాంతియాకుమారిని రాష్ట్ర మహిళా అధ్యక్షురాలిగా నియమించడం అభినందనీయం.ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆమె నియామకం పార్టీకి ఉపయోకరంగా ఉంటుంది. ఒక రూట్ మ్యాప్‌ను సిద్ధం చేసుకుని ప్రజల్లోకి వెళ్తాం. ప్రజా సమస్యల పరిష్కరిస్తానని గద్దెనెక్కిన ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి మాట ఇచ్చి మడమ తిప్పారని చెప్పారు. ఈ యాత్రలో అడుగడుగున్నా వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రభుత్వంపై పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఐదు వందలకే వంట గ్యాస్ సరఫరా హామీని ప్రజలకు ఈ యాత్రలో వివరిస్తామని అన్నారు.

తండ్రి ఆశయాలకు విరుద్దంగా పాలన చేస్తున్న జగన్: మస్తాన్ వలీ

కాంగ్రెస్ హయాంలో ఇందిరమ్మ పాలనను రాష్ట్రంలో దివంగత నేత రాజాశేఖరరెడ్డి(Rajasekhara Reddy) ముందుకు తీసుకెళ్లారని ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలీ(Mastan Wali) అన్నారు.వైఎస్సార్ పేరు చెప్పుకుని అధికారంలోకి వచ్చిన జగన్ ప్రభుత్వం తండ్రి ఆశయాలకు విరుద్దంగా పాలన చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.రాష్ట్రం నుంచి మహిళలు అదృశ్యమవుతున్నారని పార్లమెంట్ సాక్షిగా చెప్పినా.. జగన్‌లో చలనం లేదన్నారు.టీడీపీ అధినేత చంద్రబాబు, జగన్ల దోపిడీతో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని మండిపడ్డారు. ఏపీలో కూడా కేరళ తరహాలో ఐదు వందలకు గ్యాస్ బండ, ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తామని చెప్పారు. గతంలో ఫీజు రీయంబర్స్‌మెంట్ ఉంటే.. దానిని తొలగించి.. అమ్మఒడి పేరుతో జగన్‌రెడ్డి ప్రజలను మోసం చేశారని దుయ్యబట్టారు. రాష్ట్రంలో ఉన్న మహిళలంతా ఒక్కసారి ఆలోచన చేయండి... కాంగ్రెస్‌కు పట్టం కట్టండి అని మస్తాన్ వలీ పిలుపునిచ్చారు.

Updated Date - 2023-08-07T15:34:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising