Palnadu Dist.: నరసరావుపేట మున్సిపల్ ఆఫీస్‌ను ముట్టడించిన టిడ్కో
ABN, First Publish Date - 2023-02-04T15:31:28+05:30
పల్నాడు జిల్లా: నరసరావుపేట మున్సిపల్ కార్యాలయాన్ని టిడ్కో (Tidco) లబ్దిదారులు ముట్టడించారు. టీడీపీ ఇన్చార్జ్ చదలవాడ అరవింద బాబు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.
పల్నాడు జిల్లా: నరసరావుపేట మున్సిపల్ కార్యాలయాన్ని టిడ్కో (Tidco) లబ్దిదారులు ముట్టడించారు. టీడీపీ ఇన్చార్జ్ (TDP Incharge) చదలవాడ అరవింద బాబు (Chadalawada Aravinda Babu) ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ప్రధాన గేట్ మూసివేసి లబ్దిదారులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా శనివారం అరవింద బాబు మీడియాతో మాట్లాడుతూ టీడీపీ హయాంలో 1,504 టిడ్కో గృహాలు పూర్తి చేశారని, లబ్ధిదారులకు కేటాయింపు కూడా జరిగిందని చెప్పారు. అయితే జగన్ ప్రభుత్వం (Jagan Govt.) అధికారంలోకి వచ్చిన తర్వాత నలుగురు కమిషనర్లు మారారన్నారు. అప్పటిలో రూ. 50 వేలు ప్రతి లబ్దిదారులు డీడీలు ఇచ్చారన్నారు. తిరిగి రూ. 25వేలు లబ్దిదారుడికి ఇవ్వమని కేంద్రం చెప్పినా రాష్ట్ర ప్రభుత్వం పెడచెవిన పెట్టిందని విమర్శించారు. అప్పటి లబ్ధి దారులను తొలగించి ఎమ్మెల్యే గోపిరెడ్డి, వైసీపీ అనుచరులను జాబితాలో చేర్చారని ఆరోపించారు. కోటప్పకొండలో ప్రమాణం చేసి అన్నీ నిరూపిస్తానన్నారు. లబ్ధి దారుల జాబితాలో కొత్తవారిని చేర్చడాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోమన్నారు. ఊగాధి లోపు ఇళ్లు కేటాయించాలని చదలవాడ అరవింద బాబు డిమాండ్ చేశారు.
కాగా అంతకుముందు నరసరావుపేటలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న టీడీపీ నేత, మాజీ ఎంపీపీ వెన్నా బాల కోటిరెడ్డిని జిల్లా అధ్యక్షుడు జీవి ఆంజనేయులుతో కలిసి చదలవాడ అరవింద బాబు పరామర్శించారు. బాల కోటిరెడ్డిపై దాడి జరగడం ఇది రెండోసారి అరవింద బాబు అన్నారు. వైసీపీ నాయకులు నరసరావుపేటలో గన్ కల్చర్ తీసుకొచ్చారని, ప్రభుత్వం అండదండలతో వైసీపీ ఎంపీపీ భర్త కొంతమంది గుండాలతో కలిసి దాడి చేశారన్నారు. గతంలో హత్య యత్నం జరిగినప్పుడే పోలీసులు కఠినంగా వ్యవహరించి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని అరవింద బాబు అన్నారు.
Updated Date - 2023-02-04T15:31:35+05:30 IST