AP NEWS: సెప్టెంబర్ 1న కూడా టీచర్లకు జీతాలు పడలే..
ABN, First Publish Date - 2023-08-31T21:40:13+05:30
పీలో టీచర్ల(Teachers)కు సెప్టెంబర్ 1వ తేదీన కూడా జీతాలు(Salaries) రానట్లుగా ఉన్నాయి. జీతాలకు సంబంధించిన CFMSలో ఇంకా పడనట్లుగా చూపిస్తోంది.
అమరావతి: ఏపీలో టీచర్ల(Teachers)కు సెప్టెంబర్ 1వ తేదీన కూడా జీతాలు(Salaries) పడనట్లుగా కనిపిస్తున్నాయి. జీతాలు ఇంకా పడకపోవడంతో టీచర్లు ఆందోళనకు గురవుతున్నారు. ప్రతిసారి ఇలాగే జరుగుతుండడంతో టీచర్లు వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. CFMSలో జీతాలు ఇంకా పడనట్లుగా చూపిస్తోంది. వేతన బిల్లులు నేటివరకు అప్‌లోడ్ కాకపోవడంతో ఉద్యోగులు వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర నిరాశ వ్యక్తం చేస్తున్నారు. CFMSలో వెబ్‌సైబ్ ఎనబుల్ అని కనిపిస్తోంది. రెగ్యులర్ పే రోల్ బిల్లు కూడా ఎనబుల్ చేయనట్టు కనిపిస్తోంది.CFMS స్క్రీన్ షాట్‌ను టీచర్లు వాట్సాప్ గ్రూప్‌లలో షేర్ చేస్తున్నారు. ఇప్పటికే బదిలీ అయిన టీచర్లకు కూడా 3 నెలలుగా జీతాలు అందని పరిస్థితి. జీతాలు సమయానికి పడకపోవడంతో ఉపాధ్యాయులకు కుటుంబ పోషణ భారమై పోతోంది. 15 రోజులకు మాత్రమే జీతాలిచ్చి.. 3 నెలలుగా జీతాలు ఆపేశారని టీచర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జీతాలు నేరుగా ఖాతాల్లో జమ చేయాలని ప్రభుత్వాన్ని టీచర్లు డిమాండ్ చేస్తున్నారు.ఏపీ ప్రభుత్వ ఖజానాలో కాసులు లేకనే.. CFMSలో ఎనబుల్ చేశారంటూ ఉపాధ్యాయులు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
Updated Date - 2023-08-31T21:40:13+05:30 IST