AP News: జగన్ సర్కార్‌పై సచివాలయం ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులు ఫైర్
ABN, First Publish Date - 2023-07-06T17:20:05+05:30
జగన్ సర్కార్‌పై సచివాలయం ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులు మండిపడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ సచివాలయ ఎస్సీ, ఎస్టీ ఎంప్లాయిస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కీలక సమావేశం జరిగింది. 2003లో అప్పటి టీడీపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌లో ఎస్సీ, ఎస్టీలకు ప్రమోషన్లలలో రిజర్వేషన్లు కల్పించింది. దీనిని తిరిగి జగన్ సర్కార్ 2022లో మిడిల్ లెవెల్ ఆఫీసర్‌తో అడ్వైజర్ కమిటీ ఏర్పాటు చేసింది. ఆ కమిటీ ఇచ్చిన రిపోర్టును ప్రభుత్వం ఆమోదించడంపై ఉద్యోగులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు
అమరావతి: జగన్ సర్కార్‌పై సచివాలయం ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులు మండిపడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ సచివాలయ ఎస్సీ, ఎస్టీ ఎంప్లాయిస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కీలక సమావేశం జరిగింది. 2003లో అప్పటి టీడీపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌లో ఎస్సీ, ఎస్టీలకు ప్రమోషన్లలలో రిజర్వేషన్లు కల్పించింది. దీనిని తిరిగి జగన్ సర్కార్ 2022లో మిడిల్ లెవెల్ ఆఫీసర్‌తో అడ్వైజర్ కమిటీ ఏర్పాటు చేసింది. ఆ కమిటీ ఇచ్చిన రిపోర్టును ప్రభుత్వం ఆమోదించడంపై ఉద్యోగులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ కమిటీ రిపోర్ట్‌ను ప్రభుత్వం ఆమోదించటాన్ని వ్యతిరేకిస్తూ ఆంధ్రప్రదేశ్ సెక్రటేరియట్ ఎస్సీ ఎస్టీ ఎంప్లాయిస్ తీర్మానం చేశారు. ఈ సమావేశానికి నేషనల్ ట్రైబల్ ఎంప్లాయిస్ అసోసియేషన్ సెక్రటరీ పీవీ రమణ, ఏపీ ఎస్సీ, ఎస్టీ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ సెక్రటరీ సునీల్ కుమార్‌లు హాజరయ్యారు.
సమావేశంలో తీసుకున్న తీర్మానాలు:
1) సర్వీస్ రూల్స్ విరుద్ధంగా ఏర్పాటు చేసిన అడ్వైజర్ కమిటినీ ప్రభుత్వం ఆమోదించటాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ తీర్మానం.
2) రాజ్యాంగం ద్వారా సంక్రమించిన ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల హక్కులను కాలరాయటాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ తీర్మానం
3) రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రభుత్వ శాఖలలో ఉన్న ఎస్సీ, ఎస్టీ ఎంప్లాయ్ సంఘాలు అన్నీ కలిసి ఒక జేఏసీగా ఏర్పడాలని నిర్ణయం
4) అలా ఏర్పడే జేఏసీలో ఈ విషయంపై జులై 15న చర్చించి భవిష్యత్ కార్యాచరణ పై నిర్ణయం.
Updated Date - 2023-07-06T17:20:05+05:30 IST