ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

AP News: సీఎం జగన్‌కు లేఖ రాసిన టీడీపీ నేత వర్ల రామయ్య

ABN, First Publish Date - 2023-06-01T16:40:23+05:30

అమరావతి: రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ దుస్థితిపై టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ముఖ్యమంత్రి జగన్‌కు లేఖ రాశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ (SHRC) దుస్థితిపై టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య (Varla Ramaiah) ముఖ్యమంత్రి జగన్‌ (CM Jagan)కు లేఖ (Letter) రాశారు. ఈ సందర్భంగా గురువారం ఆయనఇక్కడ మీడియాతో మాట్లాడుతూ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కొన్ని ప్రభుత్వ సంస్థల దుస్థితి హృదయ విదారకంగా ఉందని, వైసీపీ ప్రభుత్వం బాకా ఊదుకుంటూ ప్రచారం చేసుకోవడం తప్ప చర్యలు శూన్యమని విమర్శించారు. కర్నూలులో ఏర్పాటు చేసిన రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ (ఎస్‌హెచ్‌ఆర్‌సీ) దుస్థితి ఇందుకు మంచి ఉదాహరణగా పేర్కొన్నారు.

రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌కు కనీసం ఒక స్టెనోగ్రాఫర్‌, టైపిస్ట్‌ను గానీ ఇవ్వలేని దుస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉండటం దౌర్భాగ్యమని వర్ల రామయ్య అన్నారు. కమిషన్ ఆదేశాలు జారీ చేసేందుకు టైపిస్టు లేకపోవడంతో చైర్‌పర్సనే స్వయంగా టైప్ చేసుకోవడం ప్రభుత్వ సంస్థల దయనీయ స్థితికి అద్దంపడుతోందన్నారు. ఇదే విషయాన్ని జత చేసిన ఉత్తర్వులలో ఛైర్‌పర్సన్ సీతారామ మూర్తి పేర్కొన్నారు. ముఖ్యమంత్రి మాత్రం ప్రజల సొమ్ముతో ఆడంబరంగా ప్రచారం చేసుకుంటున్నారని ఆరోపించారు. కనీసం ఇకనైనా రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌కు అవసరమైన సిబ్బందిని, మౌళిక సదుపాయాలు కల్పించాలని వర్ల రామయ్య విజ్ఞప్తి చేశారు. మానవ హక్కుల కమిషన్ లక్ష్యాలను సాధించడానికి సక్రమంగా పనిచేయడానికి వీలు కల్పించాలని కోరారు.

Updated Date - 2023-06-01T16:40:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising