ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Varla Ramaiah: దళితులంతా ఒక తాటిపైకి రావాలి..

ABN, First Publish Date - 2023-05-21T13:01:12+05:30

అమరావతి: రాష్ట్రంలో దళితులపై జరుగుతున్న దాడులు, ప్రభుత్వ వైఫల్యాలపై టీడీపీ ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం ప్రారంభమైంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: రాష్ట్రంలో దళితులపై జరుగుతున్న దాడులు, ప్రభుత్వ వైఫల్యాలపై టీడీపీ ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం ప్రారంభమైంది. టీడీపీ ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో జరుగుతున్న అఖిలపక్ష సమావేశానికి రాజకీయ పార్టీల నాయకులు, పలు సంఘాల నాయకులు, వర్ల రామయ్య, నక్కా ఆనందబాబు, టీడీపీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు ఎంఎస్ రాజు, మందకృష్ణ మాదిగ, కొలికపూడి శ్రీనివాసరావు, పోతుల బాలకోటయ్య తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య మాట్లాడుతూ నాలుగేళ్లలో జగన్ సర్కార్ అనేక మంది దళితులను పొట్టనపెట్టుకుందని మండిపడ్డారు. దళితులంతా ఒకే తాటిపైకి రావాలని, ఆకాశంలో ఉన్న జగన్‌ను భూమిమీదకు తీసుకురావాలని, దళితుల పోరాటం ఎలా ఉంటుందో జగన్‌కు చూపించాలన్నారు.

దళితుల దెబ్బకు సీఎం జగన్‌కు దిమ్మ తిరిగి బొమ్మ కనపడాలని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు నక్కా ఆనంద్ బాబు అన్నారు. వైసీపీలో ఉన్న దళిత మంత్రులు, ఎమ్మెల్యేలు ఉత్సవిగ్రహల్లా మారారని విమర్శించారు. ఎప్పుడో చూసిన శిరో ముండనాలు మళ్ళీ జగన్ ప్రభుత్వంలో కనిపిస్తున్నాయన్నారు. దళిత ఓటు బ్యాంకుతో అధికారంలోకి వచ్చిన జగన్.. నేడు ఆ దళితులనే మోసం చేశారన్నారు. దళితులంతా జగన్‌ను తరిమి తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు. ఈ అఖిలపక్షం సమావేశం ద్వారా ఒక యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తామని నక్కా ఆనంద్ బాబు స్పష్టం చేశారు.

Updated Date - 2023-05-21T13:01:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising