ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

High Court: తిరుమల నడక మార్గంలో ఫెన్సింగ్ ఏర్పాటుపై హైకోర్టులో విచారణ

ABN, First Publish Date - 2023-10-18T16:22:31+05:30

అలిపిరి నుంచి తిరుమల వరకూ నడక మార్గంలో (Tirumala walkway) ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని దాఖలైన పిటిషన్‌పై హైకోర్టు (High Court) విచారణ చేపట్టింది.

అమరావతి: అలిపిరి నుంచి తిరుమల వరకూ నడక మార్గంలో (Tirumala walkway) ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని దాఖలైన పిటిషన్‌పై హైకోర్టు (High Court) విచారణ చేపట్టింది. డెహ్రాడూన్ నుంచి వన్యప్రాణి సంరక్షణ అధికారులను తీసుకొచ్చి నడక మార్గాన్ని పరిశీలించాల్సిందిగా కోరామని అటవీ శాఖ అధికారులు తెలిపారు.

వారు పరిశీలించి త్వరలోనే నివేదిక ఇస్తామని చెప్పారని హైకోర్టుకు అటవీ శాఖ నివేదిక ఇచ్చింది. ప్రతి రెండు కిలో మీటర్లకు గార్డును నియమించామని, అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని టీటీడీ అధికారులు హైకోర్టుకు తెలిపారు. ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తే వన్యప్రాణుల కదలికలను నిరోధించినట్టు కాదా అని ధర్మాసనం ప్రశ్నించింది. ఫెన్సిల్ ఏర్పాటు చేసి అండర్ పాస్ లు నిర్మిస్తే వణ్యప్రాణులు సంచారానికి ఎటువంటి ఆటంకాలు ఉండవని పిటీషనర్ తరపున న్యాయవాది బాలాజీ యలమంజుల హైకోర్టుకు తెలిపారు. చిరుత దాడిలో బలైన లక్షిత కుటుంబానికి ప్రకటించిన ఎక్స్‌గ్రేషియాను పెంచాలని కోర్టు ఆదేశించినా, టీటీడీ పట్టించుకోలేదని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. భక్తులకు కర్రలు ఇస్తే ఉపయోగం ఏంటని న్యాయవాది బాలాజీ వాదనలు వినిపించారు. కేసు విచారణను హైకోర్టు 6 వారాలకు వాయిదా వేసింది.

Updated Date - 2023-10-18T16:41:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising