Chandrababu: ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా
ABN, First Publish Date - 2023-12-01T16:09:40+05:30
ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్‌మెంట్ మార్పు కేసులో టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా పడింది. చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్‌పై ఈ రోజు మధ్యాహ్నం ఏపీ హైకోర్టు విచారణ చేపట్టింది.
అమరావతి: ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్‌మెంట్ మార్పు కేసులో టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా పడింది. చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్‌పై ఈ రోజు మధ్యాహ్నం ఏపీ హైకోర్టు విచారణ చేపట్టింది. అడ్వకేట్ జనరల్ తరపున సీఐడీ న్యాయవాది dhushyamth రెడ్డి వాదించారు. డిసెంబర్ 6 వ తేదీకి కేసు విచారణను వాయిదా వేయాలని న్యాయవాది కోర్టును కోరారు. దీంతో డిసెంబర్ 6 కు కేసు విచారణను వాయిదా వేసినట్లు ఏపీ హైకోర్టు వెల్లడించింది.
అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్‌మెంట్ కేసులో అక్రమాలు జరిగాయని ఏపీలోని జగన్ ప్రభుత్వం ఆరోపిస్తోంది. ఈ మేరకు గత ప్రభుత్వ హయాంలో స్కాం జరిగిందని సీఐడీ కేసు నమోదు చేసింది. ఈ కేసులో చంద్రబాబు పేరును కూడా చేర్చింది.
Updated Date - 2023-12-01T17:36:11+05:30 IST