ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

AP News: విస్సన్నపేటలో భారీగా గంజాయి సీజ్

ABN, First Publish Date - 2023-07-01T16:16:21+05:30

జిల్లాలోని విస్సన్నపేటలో 2200 గ్రాముల గంజాయిని పోలీసులు సీజ్ చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎన్టీఆర్ జిల్లా: జిల్లాలోని విస్సన్నపేటలో 2200 గ్రాముల గంజాయిని పోలీసులు సీజ్ చేశారు. గంజాయిని తరలిస్తున్న ఇద్దరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ద్విచక్రవాహనాన్ని సీజ్ చేశారు. నిందితులు రెడ్డిగూడెం మండలం ముచ్చినపల్లికి చెందిన గంట జీవన్, వైయస్సార్ కాలనీ గుణదలకు చెందిన నరసింహ శెట్టి సాయికుమార్‌గా గుర్తించారు. గంజాయికి బాగా అలవాటుపడ్డ వీరు.. ఎక్కువ డబ్బులు సంపాదించాలని గంజాయి అక్రమ రవాణాకు పూనుకున్నారు. ఇందుకోసం రెడ్డిగూడెం పోలీస్ స్టేషన్ పరిధిలోని కునపురాజు పర్వ గ్రామంలో ద్విచక్ర వాహనాన్ని చోరీ చేశారు. ఏజెన్సీ ఏరియా సీలేరులో గుర్తుతెలియని వ్యక్తి నుంచి తక్కువ రేటుకు కొని ఎక్కువ డబ్బు సంపాదించడమే ధ్యేయంగా పెట్టుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు గంజాయిని పట్టుకుని.. ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. గంజాయిని సీజ్ చేసిన సర్కిల్ ఇన్స్పెక్టర్ రుద్రమరాజు భీమరాజు, సబ్ ఇన్స్పెక్టర్ జీవీవీ సత్యనారాయణ, సిబ్బందిని ఏసీపీ అభినందించారు. విస్సన్నపేటలో గతంలోనూ 1100 గ్రాముల గంజాయిని పోలీసులు పట్టుకున్న విషయం తెలిసిందే. దీంతో విస్సన్నపేట పోలీస్‌స్టేషన్ పరిధిలో మొత్తం 3300 గ్రాముల గంజాయి పట్టుబడింది.

Updated Date - 2023-07-01T16:25:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising